Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

కరూర్‌ లాంటి ఘటనలు గుణపాఠాలు కావాలి|EDITORIAL

తమిళనాడులోని కరూర్‌లో సెప్టెంబర్ 27, 2025న సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభ తీవ్ర విషాదానికి దారి తీసింది. తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం, మృతుల్లో పిల్లలుండటం, అనేక మంది క్షతగాత్రులవడం దేశవ్యా్ప్తంగా సంచలనమైంది. తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే కుంభమేళా, ఢిల్లీ రైల్వేస్టేషన్, గోవా, ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాటలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మన దగ్గరే ఇలాంటి ఘటనలు తరచుగా ఎందుకు జరుగుతున్నాయి? నిర్వాహకుల లోపమా? ప్రజల పాపమా? ఇలాంటి ఘటనల అనుభవంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

జనవరి 29న మహాకుంభ మేళాలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారు. 60 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ఫిబ్రవరి 16న ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలు సహా 18 మంది చనిపోగా మరో 20 మందికిపైగా గాయపడ్డారు. మే3న గోవా షిర్గావ్ లోని శ్రీ లైరాయ్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 7గురు మరణించారు. జూన్ 4, 2025న బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. జూన్ 29న పూరి రథయాత్రలో ముగ్గురు చనిపోయారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో 8 మంది పిల్లలతో సహా 41 మంది తొక్కిసలాటకు బలయ్యారు. సినిమాకు సంబంధించి 2024, డిసెంబర్ 4న పుష్ఫ 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గతంలో ఏపీలో చంద్రబాబు హయాంలో గోదావరి పుష్కరాల సందర్భంగా పదుల సంఖ్యలో చనిపోయారు. మొన్నటి జగన్ ర్యాలీలో ఒకరిద్దరు చనిపోయారు. ప్రమాదాలు జరిగాక నష్టపరిహారాలు, ప్యాకేజీలేవీ తిరిగి వారిని తీసుకరాలేవు.

ఈ ప్రమాదాలకు కారణం ప్రమాదకర రీతిలో జన సాంద్రత ఉండటమే. ఒక చదరపు మీటర్ ప్రదేశంలో సాధారణంగా 5-7 మంది ఉండాల్సిందానికి భిన్నంగా, కుక్కినట్లుగా జనం ఉండటం, ఇసుక రాలనంత ఇరుకు, కాలు మోపలేనంత సందు లేకపోవడం వల్లే తొక్కిసలాటలు జరుగుతున్నాయి. పైగా, ప్యాక్డ్‌గా ఉన్న జనంపై చిన్న ఒత్తిడి జరిగినా, పేకమేడలా పడిపోతారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకుపోయే యత్నంలో మరికొందరు పడి, మిగతా వాళ్ల కాళ్ల కింద నలిగి, ఊపిరాడక ప్రాణాలు కోల్పోతారు. ఇదే సినీ, రాజకీయ సభలైతే, తొక్కిసలాట తీవ్రత మరీ ఎక్కువగా ఉంటున్నది.

ఇక నిర్వాహకులు 10వేల మంది వచ్చే అవకాశం ఉంటే, వెయ్యి మందికి ఏర్పాట్లు చుసుకోవడం పరిపాటిగా మారింది. కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా జనం తరలిరావడం కూడా జరుగుతున్నది. ఈ క్రౌడ్ కంట్రోల్ విషయంలో నిర్వహకులు నిర్లక్ష్యంగా, ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. సరైన ఎంట్రీ, ఎగ్జిట్ ప్లానింగ్, కార్యక్రమం జరిగే ప్రదేశంలో లైనింగ్స్, బ్యారికేడ్లు లేకపోవడం తొక్కిసలాటలకు దారితీస్తున్నాయి. క్రౌడ్ మేనేజ్మెంట్ పై సరైన అవగాహన ఉండటం లేదు. వలంటీర్లను నియమించినా, వారేం చేయలేకపోతున్నారు.

ఇదే సమయంలో జనం సభకు నిండుగా వచ్చే వరకు సినీతారలు, లీడర్లు సభా ప్రాంగనానికి రావడం లేదు. గంటల తరబడి ఆలస్యంగా రావడం, వాళ్ళని చూడ్డానికి జనం ఎగపడ్డం వల్ల కూడా తొక్కిసలాటలు జరిగి, విలువైన మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కరూర్‌లో విజయ్ కూడా దాదాపు 6 గంటలు ఆలస్యంగా వచ్చారు. ఇలాంటప్పుడు ప్రజల్లో అంతకంతకు అసహనం, ఆసక్తి పెరుగిపోతుంది. కుంభమేళా లాంటి ప్రదేశాల్లో సీసీటీవీలు, క్రౌడ్‌ను సూచించే సెన్సార్లు ఏర్పాటు చేసినా, అవి ఇచ్చిన డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవడంలో నిర్వాహకులు పూర్తిగా విఫలం అయ్యారు. అనుకోని సంఘటన జరిగితే.. అంబులెన్స్ లు రావడానికి, జనాలు పారిపోవడానికి సరైన మార్గాలు ఉండటం లేదు.
ఇలాంటి తొక్కిసలాటలను సీరియస్‌గా పరిగణించాలి. అవసరమైతే నిర్వాహకులు పటిష్ట భద్రత చర్యలు తీసుకునేలా చట్టాలు రూపొందించాలి. ఆర్సీబీ ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం క్రౌడ్ కంట్రోల్ బిల్ 2025 తీసుకొచ్చింది. రాజకీయ, సినిమా, మతపరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు, నిర్వాహకులకు తీసుకోవాల్సిన భద్రత చర్యల గురించి వివరించాలి. అంతర్జాతీయంగా అమలులో ఉన్న భద్రత ప్రమాణాలు పాటించేలా చేయాలి. లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించాలి. కార్యక్రమం ఏర్పాటు చేసే ప్రదేశానికి అనుగుణంగా జన సమూహానికి అనుమతించాలి. అలాగే ఇండిపెండెంట్ నిపుణులు ధ్రువీకరించిన క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్లను నిర్వాహకులు అధికారులకు ముందే సమర్పించేలా చర్యలు చేపట్టాలి. ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళే ప్రజలు కూడా జాగ్రతలు తీసుకోవాలి. వీలైతే ముందుగా లేదా ఆలస్యంగా వెళ్లాలి. ఎవరినీ ముందుకు తోయకూడదు. బయటకు వెళ్లే దారులను బట్టి మసలుకోవాలి. అనూహ్యంగా తొక్కిసలాటలో చిక్కుకుంటే, చేతులు ఛాతిపై పెట్టుకోవాలి. ఒకవేళ కింద పడిపోతే, తల, మెడ కవర్ అయ్యేటట్లు చేతులు అడ్డుపెట్టుకుని ముడుచుకుపోవాలి. వీలైనంత త్వరగా పైకి లేచేందుకు ప్రయత్నించాలి. దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలను గుణపాఠాలుగా తీసుకుని, ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాలి. మెరుగైన చట్టాలను రూపొందించాలి. ఎక్కువమంది ప్రజలు హాజరయ్యే సభలు, కార్యక్రమాలకు.. సరైన ప్లానింగ్ ఉంటేనే అనుమతులు ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో కరూర్ లాంటి దుర్ఘటనలను నివారించడానికి వీలవుతుంది.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News