Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

వందేళ్ళ ఆర్ఎస్ఎస్-ఓ అవలోకనం|EDITORIAL

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, నేషనల్ వాలంటీర్ యూనియన్ ‘ లేదా ‘ నేషనల్ వాలంటీర్ కార్ప్స్ ‘ అనేది భారతీయ మితవాద హిందూత్వ స్వచ్ఛంద పారామిలటరీ సంస్థ. ఆర్ఎస్ఎస్ ను సెప్టెంబర్ 27, 1925న స్థాపించిన కేశవ్ బలిరాం హెడ్గేవార్ ముత్తాత నరహర శాస్త్రి ప్రస్తుత తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుండి నాగ్‌పూర్‌కు వలస వెళ్ళారు. హెడ్గేవార్ నాగపూర్ లో మరాఠీగా పుట్టినా, ఆయన మూలాలు మాత్రం తెలంగాణవే. కాగా, సీపీఐ కూడా ఇదే ఏడాది అంటే 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ప్రారంభించబడింది. దేశంలో కుడి, ఎడమలు రెండూ కూడా రెండు నెలల తేడాతో ఒకే ఏడాదిలో ఏర్పడటం కాకతాళీయం.

మార్చి 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్ రోజువారీ శాఖల సంఖ్య 83,124. అదేవిధంగా, వారపు శాఖల సంఖ్య 32,147. అయితే తన శతాబ్ది ఏడాదిలో తన రోజువారీ శాఖల సంఖ్యను లక్షకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కోటి మంది స్వయం సేవకులున్నారు. ప్రతి ఏటా 2.23 లక్షల మంది కొత్తగా చేరుతున్నారు. ‘జాయిన్ ఆర్ఎస్ఎస్’ వెబ్ సైట్ ద్వారా 12.7 మిలియన్ల ప్రజలు సంప్రదించారు.
ఆర్ఎస్ఎస్ వందేళ్ళ ప్రయాణం అసాధారణమైంది. దేశంలో జాతి, మత, సంస్కృతి, రాజకీయ రంగాలపై ఆర్ఎస్ఎస్ ముద్ర విస్మరించలేనిది సేవ, క్రమశిక్షణ, ఆత్మసంకల్పం వంటి వాటితో పాటు విమర్శలు, సంఘర్షణలు, రాజకీయపరమైన చిక్కులు, దాని చరిత్ర గతిలో గతించిన, ప్రస్తుతిస్తున్న వాస్తవాలు. భవిష్యత్తులోనూ ఆర్ఎస్ఎస్, తన సిద్ధాంతాన్ని మారుతున్న సమాజంతో ఏవిధంగా సమన్వయం చేసుకుంటుంది? హిందుత్వ, “భక్తి- సంస్కృతి” సరే, మైనారిటీలను ఏ విధంగా సమన్వయం చేస్తుంది? వీటన్నింటినీ ఆర్ఎస్ఎస్ సమీక్షించుకుంటుందా? ఆత్మ విమర్శ చేసుకుంటుందా? ప్రజాస్వామిక విలువలను పెంపొందిస్తుందా? స్వీయ మనుగడను కొనసాగిస్తుందా? ‘డా. మార్గం – అడుగు’ ఎడిటోరియల్ 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, నేషనల్ వాలంటీర్ యూనియన్ ‘ లేదా ‘ నేషనల్ వాలంటీర్ కార్ప్స్ ‘ అనేది భారతీయ మితవాద హిందూత్వ స్వచ్ఛంద పారామిలటరీ సంస్థ. ఇది ‘సంఘ్ పరివార్’ అని పిలువబడే ఒక పెద్ద హిందూత్వ సంస్థల సమూహానికి నాయకత్వం వహించే మూలం. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని పాలక బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ మాతృకగా గల జనసంఘ్ నుంచి ఆవిర్భవించిందే. మోహన్ భగవత్ ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ సర్సంఘ్‌చాలక్- చీఫ్ గా, దత్తాత్రే హోసబాలే సర్కార్యవ: – జనరల్ సెక్రటరీగా ఉన్నారు.

ఆర్ఎస్ఎస్ ను సెప్టెంబర్ 27, 1925న స్థాపించింది కేశవ్ బలిరాం హెడ్గేవార్. కేబీ హెడ్గేవార్ ఏప్రిల్ 1, 1889న నాగ్‌పూర్, సెంట్రల్ ప్రావిన్స్ బేరార్‌లోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన ముత్తాత నరహర శాస్త్రి ప్రస్తుత తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుండి నాగ్‌పూర్‌కు వలస వెళ్ళారు. హెడ్గేవార్ నాగపూర్ లో మరాఠీగా పుట్టినా, ఆయన మూలాలు మాత్రం తెలంగాణవే. కాగా, సీపీఐ కూడా ఇదే ఏడాది అంటే 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ప్రారంభించబడింది. దేశంలో కుడి, ఎడమలు రెండూ కూడా రెండు నెలల తేడాతో ఒకే ఏడాదిలో ఏర్పడటం కాకతాళీయం.

అయితే, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు 100 రోజులుగా అనేక కార్యక్రమాలుగా జరిగాయి. 1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభించిన, నాగపూర్ లోని రేషింబాగ్ మైదానంలోనే 2025 అక్టోబర్ 2న విజయదశమి రోజు శతాబ్ది కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ముగింపు ఉత్సవాలలో ప్రధాని మోదీ, ఢిల్లీలోని బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో రూ.100 నాణాన్ని, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. దేశ చరిత్రలో ఇండియన్ కరెన్సీపై భరతమాత ఉండటం ఇదే తొలిసారి. నాణెంపై ఒకవైపు జాతీయ చిహ్నం ముద్రించగా, మరోవైపు భరతమాత వరద ముద్రతో సింహంతో సహా ఉన్న చిత్రం ముద్రించారు. స్వయం సేవకులు భరత మాత ముందు భక్తి, అంకితభావంతో ప్రణామం చేస్తున్నట్టు చిత్రీకరించారు. 1925 నుంచి 2025 వరకూ 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని నాణెంపై రాసి ఉంది. ‘ప్రతీదీ దేశానికి అంకితం, ప్రతీదీ దేశానిదే, నాదంటూ ఏమీలేదు -‘రాష్ట్రీయ స్వాహా, ఇదం రాష్ట్రీయ, ఇదం నమమ’- అనే సంస్థ సిద్ధాంతాన్ని నాణెంపై చిత్రించారు. 1963 రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను హైలైట్ చేస్తూ రూపొందించిన పోస్టల్ స్టాంపును కూడా ప్రధాని విడుదల చేశారు. శతాబ్ద కాలంగా సేవ, అంకితభావంతో ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న సుదీర్ఘ ప్రయాణం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని ప్రశంసించారు. దేశంపై ఉన్న భక్తి, త్యాగం, నిబద్ధతకు ఆర్ఎస్ఎస్ నిదర్శనమన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రతి పనిలో నేషనల్ ఫస్ట్ అనేది కనిపిస్తుందని తెలిపారు. అయితే, ఇది వివాదంగా మారే అవకాశం ఉంది.

ఇక ఆర్ఎస్ఎస్ వందేళ్ళ ప్రస్థానం అంత సాఫీగా జరిగిందేమీ కాదు. బ్రిటీష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్ లో 1947 జనవరి 24న ఆర్ఎస్ఎస్ పై మొదటి నిషేధం విధించబడింది. మహాత్మా గాంధీ హత్య తర్వాత ఫిబ్రవరి 4, 1948న నిషేధించబడింది. 1975 అత్యవర పరిస్థితి సమయంలో, ఆ తర్వాత 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం కూడా నిషేధించబడింది. 1977లో అత్యవసర పరిస్థితితోపాటు ఆర్ఎస్ఎస్ పై నిషేధం కూడా ఎత్తివేయబడింది. 1948లో మహాత్మా గాంధీ హత్య తర్వాత సంస్థకు ఏర్పడిన మరక నుండి, ఆ తరువాతి దశాబ్దాల హిందూత్వ రాజకీయాలకు ‘విత్తనాలు నాటడం’ నుండి భారత రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ పాత్రను అత్యవసర పరిస్థితి చట్టబద్ధం చేసిందని చెబుతారు.
ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ తన నాగ్‌పూర్ ప్రధాన కార్యాలయంలో భారత జాతీయ జెండాను కేవలం రెండుసార్లు మాత్రమే ఎగురవేసింది, ఆగస్టు 14, 1947న మరియు జనవరి 26, 1950న, కానీ ఆ తర్వాత దానిని ఆపివేసింది. ఈ అంశం ఎల్లప్పుడూ వివాదానికి మూలంగా ఉంది.

హెడ్గేవార్ మృతి తర్వాత, మాధవ సాత్యాంధరా గోల్వాకర్ ఆర్ఎస్ఎస్ ను దేశవ్యాప్తంగా విస్తరించారు. అనుబంధంగా పలు సంస్థలు ఏర్పడ్డాయి. 1952లో భారతీయ జనసంఘ్, దీని కొనసాగింపుగా, 1980లో బీజేపీ ఆవిర్భవించాయి. వరల్డ్ హిందూ కౌన్సిల్ గా విశ్వ హిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, రాష్ట్ర సేవికా సమితి, భారత్ వికాస్ పరిషత్, విద్యా భారతి, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం వంటి సంస్థలు ఏర్పడ్డాయి. ఆర్ఎస్ఎస్ కు ప్రపంచ వ్యాప్తంగా శాఖలున్నాయి. మార్చి 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్ రోజువారీ శాఖల సంఖ్య 83,124. అదేవిధంగా, వారపు శాఖల సంఖ్య 32,147. అయితే తన శతాబ్ది ఏడాదిలో తన రోజువారీ శాఖల సంఖ్యను లక్షకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కోటి మంది స్వయం సేవకులున్నారు. ప్రతి ఏటా 2.23 లక్షల మంది కొత్తగా చేరుతున్నారు. ‘జాయిన్ ఆర్ఎస్ఎస్’ వెబ్ సైట్ ద్వారా 12.7 మిలియన్ల ప్రజలు సంప్రదించారు. అందులో చాలా మంది చేరారు. గత ఒక్క ఏడాదిలోనే వాలంటీర్లు, 89.706 సేవా భారతి, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

ఆర్ఎస్ఎస్ విపత్తుల సమయంలో రక్షణ సహాయం, రక్తదానం శిబిరాలు, విద్యా సంస్థలతో పిల్లలకు అవగాహన, గ్రామాభివృద్ధి, మహిళల సమావేశాల వంటివి నిర్వహిస్తుంటాయి. దేశ రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్-బీజేపీ అనుబంధం అతీశక్తిగా మారింది. బీజేపీకి పెట్టని కోట సంఘ్ పరివారమే. ఆర్ఎస్ఎస్, దాని పారామిలిటరీ పనితీరు, క్రమశిక్షణ, భావజాలం ఫాసిజానికి నయా రూపంగా కనిపిస్తుంది. హిందూయేతర మతాలు, మైనారిటీలపై వ్యతిరేకంగా ఉండటం, రాజ్యాంగ మౌలిక లౌకిక సూత్రానికి విరుద్ధంగా అనిపిస్తుంది. రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ తన ప్రభావాన్ని, విధానాత్మక ఒత్తిడిని కొనసాగిస్తున్నది. ఒకవైపు సేవ, సేవా కార్యక్రమాలు, విపత్తు సహాయాలు చేస్తూ సమాజ హితానికి ఉపయోగకారిగా ఉన్నది. మరోవైపు ఒక మతాన్ని ప్రేరేపిస్తూ, ఇతర మతాలను వ్యతిరేకిస్తూ మత విద్వేషిగా ఉంది. స్వాతంత్ర్యోద్యమంలో సంస్థ పాత్ర లేకపోవడం, తెలంగాణ వంటి ఉద్యమాల్లో క్రీయాశీలకంగా కనిపించకపోవడం ఆ సంస్థపై విమర్శలు.
అయితే, ఆర్ఎస్ఎస్ వందేళ్ళ ప్రయాణం అసాధారణమైంది. దేశంలో జాతి, మత, సంస్కృతి, రాజకీయ రంగాలపై ఆర్ఎస్ఎస్ ముద్ర విస్మరించలేనిదే కాదు, అత్యంత ప్రభావవంతమైంది కూడా. ఈ శతాబ్ద కాలంలో ఆర్ఎస్ఎస్ సేవ, క్రమశిక్షణ, ఆత్మసంకల్పం వంటి వాటితో పాటు విమర్శలు, సంఘర్షణలు, రాజకీయపరమైన చిక్కులు, దాని చరిత్ర గతిలో గతించిన, ప్రస్తుతిస్తున్న వాస్తవాలు. భవిష్యత్తులోనూ ఆర్ఎస్ఎస్, తన సిద్ధాంతాన్ని మారుతున్న సమాజంతో ఏవిధంగా సమన్వయం చేసుకుంటుంది? సమానతను సాధించడం ద్వారా అందరి ఆమోదం పొందగలదా? హిందూయిజం, “భక్తి- సంస్కృతి” సరే, మైనారిటీలను ఏ విధంగా సమన్వయం చేస్తుంది? వీటన్నింటినీ ఆర్ఎస్ఎస్ సమీక్షించుకుంటుందా? ఆత్మ విమర్శ చేసుకుంటుందా? సవాళ్ళను స్వీకరించి ఎదుర్కొంటుందా? ప్రజాస్వామిక విలువలను పెంపొందిస్తుందా? స్వీయ మనుగడను కొనసాగిస్తుందా? చూడాలి.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News