Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

రాజ్యాంగ పరిరక్షకులా? రాజకీయ ప్రతినిధులా!?|EDITORIAL

ఇటీవల కొన్ని బిల్లుల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో గవర్నర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘కోర్టులు జోక్యం చేసుకోవద్దంటే ఎలా? దీర్ఘకాలిక పెండింగులు ప్రజాస్వామ్యంపై, పరిపాలనపై, పురోగతిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున బిల్లుల ఆమోదానికి నిర్ణీత సమయం తప్పనిసరి’ అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఇక గవర్నర్లు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని పలు రాష్టాల్ర సీఎంలు, గవర్నర్ల వ్యవస్థ ప్రారంభమైన నాటి నుండే నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. కేరళలో నంబూద్రిపాద్‌ ప్రభుత్వం రద్దుతో మొదలైన రగడ ఉమ్మడీ ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయడం, తాజాగా  మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు గవర్నర్ వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. మొన్నటికి మొన్న తమిళనాడు గవర్నర్‌ రవి వ్యవహారంతో పరాకాష్టకు చేరి సుప్రీం మందలించే వరకు వెళ్లింది. దీంతో దేశానికి భారంగా మారిన గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయడమే మంచిదన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారత రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చినప్పటి నుండి కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో గవర్నర్ పాత్ర ప్రాధాన్యమైనది. రానురాను సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో గవర్నర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలను అణచివేయడం, కేంద్ర ప్రభుత్వ ఆకాంక్షలను నెరవేర్చడంలో గవర్నర్లు ఒక సాధనంగా మారారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజ్యాంగం ప్రకారం, గవర్నర్ రాష్ట్రపతిచే నియమించబడిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో సమాఖ్య స్ఫూర్తికి సంధానకర్త. ముఖ్యమంత్రి సలహా మేరకు పని చేయాల్సి ఉన్నప్పటికీ, “విచక్షణాధికారం” పరిమితుల్లో గవర్నర్ కు స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. ఆనాడు గవర్నర్ వ్యవస్థను రాచరిక వ్యవస్థను పోలిన ‘నామమాత్ర పాలకుని’ మాదిరిగా ఊహించారు. కానీ, అనేక సందర్భాలలో గవర్నర్లు రాజ్యాంగ పరిరక్షకులుగా కాకుండా కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతినిధులుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వంపై నియమిత వ్యక్తి అధికారం కలిగి ఉండడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే చెప్పాలి. గత కొన్ని దశాబ్దాలుగా గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ దుర్వినియోగానికి గురైన అనేక ఉదాహరణలు ఉన్నాయి. కేంద్రంలో రాష్ట్రాల్లో ఒకేపార్టీ అధికారంలో ఉంటే సరి, వేర్వేరు పార్టీలు ఉన్నప్పుడు గవర్నర్లను కేంద్రం తన ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటోంది. ఇది రాష్ట్రాల స్వతంత్రతను హరించి, సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరిచేలా చేస్తున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాణం సమయంలో గవర్నర్లను  కీలకంగా భావించారు. కానీ ఇప్పుడు గవర్నర్ అనే ఒక నియమిత ప్రతినిధి అవసరం లేదన్న భావన బలపడుతోంది.

గవర్నర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం కాకుండా, సంస్కరించే దిశగా ప్రయత్నాలు చేయవచ్చా? గవర్నర్ల నియామకానికి ఒక స్వతంత్ర కమిటీ ఏర్పాటు, గవర్నర్ పాత్రను కేవలం ప్రతీకాత్మకంగా పరిమితం చేయడం. గవర్నర్ వ్యవహారాలపై పారదర్శకత కోసం పబ్లిక్ ఆడిట్, పార్లమెంటరీ కమిటీ సమీక్షలు అమలులోకి తేవడం వంటివి చేయవచ్చు. అయితే, సమకాలీన రాజకీయాల్లో నైతికత లేకపోవడం, కేంద్రానికి ఎక్కువ అధికారాలుండటం వల్ల ఈ సంస్కరణలు సమర్థవంతంగా అమలవ్వడం అనుమానాస్పదమే. అందుకే, వ్యవస్థను పూర్తిగా తొలగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మారుతున్న కాలం, అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలు చేసుకుంటున్న మనం గవర్నర్‌ వ్యవస్థకు సవరణలు తేవడం లేదా రద్దు చేయడం ద్వారా ఖాజానాపై భారం కూడా తగ్గుతుందన్న అభిప్రాయాలు బపడుతున్నాయి.

బెంగాల్లో తీవ్ర వివాదానికి గురైన ధన్‌కడ్‌ ఉపరాష్ట్రపతి అయ్యారు. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళి సై తిరిగి రాజకీయాల్లో బీజీగా ఉన్నారు. కేరళ గవర్నర్‌గా అరీఫ్‌ మహ్మద్‌ పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగే ఉండేది. గతంలో జగదాంబికాపాల్‌ను సీట్లో కూర్చుండబెట్టింది కాంగ్రెసే. ఇప్పుడా ఒరవడిని బీజేపీ కొనసాగిస్తోంది.

ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు కూడా బిల్లుల ఆమోదంలో గవర్నర్ల పాత్రను తప్పుపట్టింది. గవర్నర్ల వ్యవస్థ రాజ్‌భవన్లను రాజకీయాలకు వేదికలుగా చేస్తున్నాయి. రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయి.

నిజానికి ఇదంతా రాజ్యాంగబద్ధంగా వ్యవస్థీ కృతమైన లోపం. దీనిపై చర్చించి, రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. లేదా గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయడం ఒక్కటే పరిష్కారం కాగలదు. అందుకు ఇదే తగిన సమయం.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News