Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

విమోచనంపై ఎందుకింత విముఖత!?|EDITORIAL

చరిత్రను విస్మరించిన జాతి లేదా దేశం ముందడుగేయడం కష్టం. తెలంగాణ విమోచనమా? విలీనమా? విద్రోహమా? అన్న అంశంపై రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. బీజేపీ విమోచన దినోత్సవంగా, బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా, కాంగ్రెస్ ప్రజా పాలన దినోత్సవంగా, ఎవరికివారు ఇష్టం వచ్చిన రీతిగా నిర్వహిస్తున్నారు. పార్టీల స్వార్థపూరిత ప్రవర్తనల కారణంగా అసలు చరిత్ర మరుగున పడుతోంది. మన భవిష్యత్ తరాలకు వాస్తవ చరిత్ర అందకుండా, తెలియకుండా పోతోంది. ఇంకొంత వక్రీకరణ కూడా జరుగుతోంది. ఒక చారిత్రక సంఘటనపై ఇన్ని రకాలుగా కార్యక్రమం నిర్వహించడం విధి విపరీత వైచిత్రి.

విమోచనోత్సవంతో లబ్ది పొందాలన్న భావనలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక్క కమ్యూనిస్టులు మాత్రమే దీనిపై బలంగా నిలబడ్డారు. అధికారికంగా విమోచనోత్సవం జరపాలని కోరుతున్నారు. అయినా అధికార కాంగ్రెస్‌ ఇందుకు సుముఖంగా లేదు. కేవలం ప్రజాపాలనతో విమోచన దినోత్సవాన్ని గట్టెక్కించాలని చూస్తోంది. కేసీఆర్‌ అధికారంలో ఉన్న పదేళ్లు కేవలం సమైక్యతా దినోత్సవం పేరిట ముగించారు. ఇప్పుడు ప్రజాపాలనతో సాగిస్తున్నారు. కేవలం నాటి రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ పెట్టిన పార్టీ, ముస్లిం ఓటు బ్యాంక్‌ కోసం బీజేపీ, కమ్యూనిస్టులు మినహా మిగతా పార్టీలు నానా గడ్డీ కరుస్తున్నాయనడానికి విమోచన దినోత్సవాన్ని ఉదాహరణగా చెప్పుకోచ్చు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం వేర్వేరుగా… వేర్వేరు పేర్లతో ఉత్సవాలను నిర్వహించడం కూడా విచిత్రమే!

నిజాం రాజరికం నుంచి విముక్తమైన ప్రజల మనోభావాలకు అనుగుణంగా సెప్టెంబర్‌ 17న ఉత్సవాలు జరుపుకోవడం నేటివరకు అధికారికంగా జరగలేదు. కేవలం మహారాష్ట్ర, కర్నాటకలో మాత్రమే ఈ ఉత్సవాలు జరిపేవారు. అనూహ్యంగా కేంద్రం విమోచనోత్సవాలు జరపాలని మూడేళ్ల క్రితం నిర్ణయించడంతో, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దిగిరాక తప్పలేదు. ఈ యేడు యథావిధిగానే బీజేపీ తనవంతుగా కార్యక్రమం చేపట్టింది. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈయేడు అతిథిగా వస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవం పేరిట జెండా వందనం నిర్వహిస్తోంది. కేంద్రం మాత్రం సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో విమోచనోత్సవాలకు శ్రీకారం చుట్టింది. దీంతో హైదరాబాద్‌ లో జరిగే ఉత్సవాల్లో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జెండా ఎగురేస్తారని అన్నారు. రాంజీ గోండు త్యాగానికి ప్రతిఫలం, తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ గుర్తు చేస్తోంది. ఒకే చెట్టుకు అత్యంత కిరాతకంగా వెయ్యి మంది తెలంగాణ ప్రజలను ఒకేసారి ఉరితీసిన నిర్మల్‌ వెయ్యి ఉరుల మర్రి ఘాతుకంలో అమరవీరులైన మన పూర్వీకులకు నివాళులు అర్పించనుంది. నిజాం రజాకార్లపై, బ్రిటిష్‌ సైన్యంపై గెరిల్లా యుద్ధం చేసిన మన రాంజీగోండు పోరాట స్ఫూర్తిని స్మరించుకుందాం అంటూ పిలుపునిస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొందాం, తెలంగాణ చరిత్రను తరువాతి తరానికి అందిద్దాం. అన్న నినాదంతో బీజేపీ ఏటా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ యేడు కూడా పరేడ్‌ గ్రౌండ్‌లో విమోచనోత్సవాలను రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభిస్తారు.

నిజానికి తెలంగాణ విముక్తి కోసం ఎందరో పోరాడారు. ఎందరో మహిళలు తమ మాన, ప్రాణాలను పోగొట్టుకున్నారు. రజాకార్ల దాష్టీకానికి ఎందరో బలయ్యారు. సర్వస్వాన్ని త్యాగం చేసిన కొమురం భీం, రాంజీ గోండు, తుర్రేబాజ్‌ ఖాన్‌, షోయబుల్లాఖాన్‌, వందేమాతరం రామచంద్రరావు, నారాయణరావ్‌ పవార్‌, నల్లా నర్సింహులు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, దాశరథి సోదరులు, కాళోజీ నారాయణరావు, పీవీ నరసింహారావు వంటి ఎందరో మహానుభావులను స్మరించుకునేందుకు ఇదొక సరైన సమయం. అలాగే ఎందరో పోరాట యోధులను గురించి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. త్యాగాలను తర్వాతి తరాలకు అందజేసేలా చరిత్రను అందుబాటులోకి తీసుకుని రావాలి. పాఠ్యాంశాలుగా ముద్రించాలి.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేక పోవడానికి పూర్తిగా రాజకీయ దివాళాకోరుతనమే కారణం. ఘనమైన తెలంగాణ చరిత్రను మరుగున పడేసే ప్రయత్నాలు సరికాదు. ఏటా విమోచనోత్సవంపై జోరుగా వాద ప్రతివాదనలు, విమర్శలు సాగుతుండేవి. అయినా తెలంగాణలో కూడా విమోచనో త్సవాలకు మోక్షం దక్కలేదు. ఈ ఉత్సవాలు జరపాలంటేనే ఎందుకనో తెలంగాణ పాలకులు విముఖత చూపుతూ వచ్చారు. తెలంగాణకు ముందు విమోచనోత్సవాలకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తప్పమరోటి జరిగేది కాదు. దేశం ఆంగ్లేయుల పాలన నుంచి ఆగస్టు 15, 1947న స్వతంత్ర మైనప్పటికీ నాటి హైదరాబాద్‌ సంస్థానం మాత్రం ఇంకా విముక్తి పొందలేదు. స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు దాదాపు 13 నెలలు పట్టింది. ఉక్కు మనిషి, నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రత్యేకమైన చొరవతీసుకుని హైదరాబాద్‌పై పోలీసు చర్యకు ఉపక్రమించడం ద్వారా హైదరాబాద్‌ సంస్థా నాన్ని భారత్‌లో విలీనం చేశారు. ఈ కారణంగా నిజాం అరాచక పాలననుంచి ప్రజలకు విమోచన లభించింది.

బైరాన్‌పల్లి, పరకాల ఘటనలను ఎలా మరచి పోగలం. వందల మందిని నిలబెట్టి రజాకార్లు పిట్టలను కాల్చినట్లు కాల్చారు. గ్రామాలను లూటీ చేసి తమ వికృతరూపాన్ని ప్రదర్శించారు. భారతదేశానికి స్వాతంత్యర్ర వచ్చిందని త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తే నిజాం, రజాకార్లు జీర్ణించుకోలేక పరకాల ప్రజలపై హత్యాకాండకు పాల్పడి మరో జలియన్ వాలా బాగ్ ను తలపించిన నాటి ఘటన నేటి యువతకు తెలవాల్సిన అవసరం ఉంది. ఆనాటి పోరాటాలను స్మరిస్తూ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాల్సి ఉంది. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాల్సిన అవసరం గురించి ప్రజలకు తెలియపరచాలి. అమర వీరుల త్యాగాలను స్మరించుకోవాలి.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News