Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

ఇటీవలి పరిణామాలు-గుణపాఠాలు!|EDITORIAL

జీఎస్టీ పన్నుల సవరింపు ఆషాఢం మాసం సేల్ లాగా మారింది. డిమాండ్ తగ్గితే తగ్గించి, పెరిగితే పెంచి అమ్ముకోవడం లాగా అధికారాన్ని నిలుపుకోవడానికి పాలకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జీఎస్టీ ప్రకటంచినప్పుడు దేశంలో పన్నుల విధానంలో అతి పెద్ద సంస్కరణగా పేర్కొన్నారు. ఇప్పుడే అదే జీఎస్టీ తగ్గించి, శ్లాబులు మార్చి నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలని అంటున్నారు. ఇంతకాలం నెత్తీనోరు మొత్తుకున్నా జీఎస్టీ తగ్గించలేదు. చివరకు ఇన్సూరెన్స్ లపైనా జీఎస్టీని బాదారు. 11 ఏళ్ల తరవాత ఆ నెపాన్ని ప్రధాన ప్రతిపక్షంపై నెట్టేసి, కొత్త వడ్డనలను మొదలు పెట్టారు. ఒక్క జీఎస్టీ తగ్గింపులే కాదు, నిత్యావసరాలు, పెట్రో డీజీల్ ధరలు, నిరుద్యోగితలు తగ్గి, ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరగాలి. వ్యవసాయం పండుగ కావాలి. యూరియా కొరతను రైతాంగం పట్ల నిర్లక్ష్యానికి పరాకాష్ట. వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మార్కెట్‌ సౌకర్యం కూడా కలగాలి. అన్నింటి కంటే ముందు ప్రజల ఆస్తులు తెగనమ్మి ఆదాయాన్ని సమకూర్చాలన్న భావన తొలగిపోవాలి.

రాజకీయ పెత్తనం తగ్గాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ జీతభత్యాలు తగ్గించుకోవాలి. నేతలకు డబుల్‌ పెన్షన్లు తొలగించాలి. కేంద్రం, రాష్ట్రాల్లో ఖర్చులు తగ్గించు కోవాలి. పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌లో ప్రజల తిరుగుబాటుకు కారణాలు తెలుసుకుని మనదేశంలో అలాంటివి జరక్కుండా ముందు జాగ్రత్త పడాలి. చిన్న దేశాల్లో అస్థిరతకు విదేశీ హస్తం కూడా కారణం కావచ్చు. అయితే ప్రజల్లో అసంతృప్తి, అసహనం గూడుకట్టుకొని ఉండడం వల్లనే తిరుగుబాట్లు వస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో విదేశీ శక్తి కూడా తోడవుతుండవచ్చు.

ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు తన ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడినప్పుడల్లా విదేశీ హస్తం అని నిందించేవారు. ఇప్పుడు మోదీ కూడా పదేపదే కాంగ్రెస్‌ను బూచిగా చూపి తప్పించుకో జూస్తున్నారు. ప్రభుత్వాలు, అధికార వ్యవస్థలలో అవినీతి పెరిగిపోవడం వల్లే మన దేశం అభివృద్ధి చెందాల్సినంతగా చెందలేదు. రాజకీయ లాలూచీ, అవినీతి కారణంగా దేశం భ్రష్టు పట్టిపోతోంది. రాజ్యాంగబద్ధ సంస్థలలో కూడా అవినీతి చొరబడటం వల్ల సామాన్యులకు న్యాయం దొరకని దుస్థితి ఏర్పడింది.

కాళేశ్వరం, ఇ-కార్‌ రేసులో అవినీతిని నిగ్గు తేల్చడం లేదు. కేసులే అపరిష్కృతంగా ఉన్నాయంటే న్యాయ వ్యవస్థపైన, ప్రభుత్వాలపైన ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందన్నది పాలకులు ఆలోచన చేయాలి. నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం వల్ల మాత్రమే తిరుగబాటు రాలేదు. ప్రభుత్వంపై ప్రజల్లో అప్పటికే అసంతృప్తి గూడుకట్టుకొని ఉంది. ఇతర అనేక అంశాలు ఇందుకు సాకయ్యాయి.

బంగ్లాదేశ్ లో ఆ దేశ అధ్యక్షురాలి భవనంపై ప్రజలు దాడులు చేసి బెడ్‌ రూంలోనూ, స్నానాల తొట్టిలోనూ కూర్చొని ఫొటోలకు పోజులిచ్చారంటే ప్రభుత్వంపై ఎంత విరక్తి చెందారో అర్థం చేసుకోవాలి. ఆ తిరుగుబాట్ల ఫలితంగా నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాలు మారినా ప్రజల జీవితాలు మాత్రం బాగుపడలేదు. గతంలో విప్లవాలన్నీ పాలకులు అవినీతి, అక్రమాలు, నిరంకుశంపైనే వచ్చాయి. కొంతకాలంగా శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌ దేశాలలో పెల్లుబికిన ప్రజల ధర్మాగ్రహం నుంచి మన పాలకులు, రాజ్యాంగ వ్యవస్థల అధిపతులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.

మన దేశం భిన్న జాతులు, భిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషల సమాహారం కనుక, ఆ చిన్న దేశాలలో వలే తిరుగుబాట్లు జరగవని నమ్మరాదు. రైతుల ఉద్యమాన్ని తక్కువగా చూడరాదు. ఇందిరాగాంధీ వంటి శక్తిమంతమైన నేత కూడా ప్రజాగ్రహానికి గురికాక తప్పలేదు. కేంద్ర రాష్ట్రాల్లో అవినీతి విపరీతంగా పెరిగింది. లంచగొండి తనం వేళ్లూనుకుంది. పాలకులపై ప్రజలు విశ్వాసం కోల్పోతు న్నారు.
అధికారమే లక్ష్యంగా సంక్షేమం పేరిట హద్దుమీరి ప్రజా ధనాన్ని పంచి పెట్టడంపై పన్ను చెల్లింపుదారులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రజలను సోమరులుగా మార్చే పథకాలను ప్రవేశపెట్టే అధికారం రాజకీయ నాయకులకు లేదు. ప్రజాధనానికి కాపలాగా, కేర్‌ టేకర్‌గా పనిచేయాల్సిన వారు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. సామాన్యులకు న్యాయం ఎండమావిగా మారుతోంది. అధికార దుర్విని యోగం హద్దు మీరుతోంది.

ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత అటు పాలకులు, ఇటు రాజ్యాంగ వ్యవస్థల అధిపతులపై ఉంది. రాజకీయా నాయకులు తమ అతిని, అవినీతిని వదులుకుని ప్రజల కోసం, దేశం కోసం పనిచేయడం అలవాటు చేసుకోవాలి. లేకుంటే ప్రజాగ్రహం తప్పదు.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News