Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

భారత్ దౌత్య విజయంగా షాంఘై సదస్సు!|EDITORIAL

షాంఘై సదస్సు ఫలితాల ప్రభావం ఎలా ఉన్నా, అది జరిగిన తీరుతెన్నులు మాత్రం ఇండియా ఆశించినట్లుగానే కనిపిస్తున్నాయి. ప్రధానంగా పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌కు కొంత అవమానకర పరిస్థితి ఉదురైంది. అలాగే ట్రంప్‌కు కళ్ళు కుట్టేలా, దిమ్మతిరిగేలా ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌, పుతిన్‌లతో కలివిడిగా కనిపించారు. నిజానికి భారత్‌, చైనాల మధ్య సంబంధాలు పెద్దగా సఖ్యతగా లేవు. ఇదే సమయంలో జరిగిన షాంఘై సదస్సు చైనా భారత్ సంబంధాలు మెరుగు పడేలా, ట్రంప్‌కు చెక్‌ పెట్టేలా, పుతిన్ తో మరింతగా స్నేహం పెరిగేలా జరిగాయి. సుంకాలతో రెచ్చిపోతున్న ట్రంప్‌కు ఇది మింగుడు పడని వ్యవహారమే. ఇదిలావుంటే అమెరికాలో ట్రంప్‌ వ్యతిరేక వర్గం కూడా ఈ సదస్సు తమ దేశానికి తీవ్ర నష్టం కలిగించేదిగా జరిగిందని భావిస్తోంది. ఇదే అదనుగా కొందరు అప్పుడే విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్‌ భారీ సుంకాల మోతల దశలో చైనా వేదికగా సాగిన షాంఘై భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికాకు హెచ్చరికగా నిలిచింది.
పాకిస్థాన్‌ ప్రధాని షహబాజ్‌ సమక్షంలోనే షాంఘై సదస్సు వేదికపై భారత్ కు అత్యంత కీలకమైన దౌత్య విజయం దక్కింది. కశ్మీర్‌లో జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడిని ఖండిస్తూ షాంఘై సహకార శిఖరాగ్ర సదస్సు సంయుక్త తీర్మానంలో స్పందన వెలువడింది. ఇతర అంతర్జాతీయ అంశాలతో పాటు ఈ ఉగ్రదాడిని ప్రస్తావించిన షాంఘై సదస్సు మన దేశానికి పూర్తి సంఫీుభావం, సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రకటించింది. రెండు నెలల క్రితం క్వింగ్డావో షాంఘై సదస్సులో తమ పట్టు నెగ్గకపోవడంతో వాకౌట్‌కు దిగిన భారత్‌, ఇప్పుడు తన పంతం నెగ్గించుకుంది.
ఏప్రిల్‌ 22న పహల్గామ్‌ ఉగ్రదాడిని సభ్యదేశాలన్ని ఖండిస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రదాడులకు ప్రేరకులు, పాత్రధారులు, సూత్రధారులు ఎవరైనా, ఎంతటివారైనా తగిన శిక్షలకు, విచారణకు అర్హులని తేల్చారు. ఉగ్రవాదం వేర్పాటువాదం, తీవ్రవాదం పట్ల ఎటువంటి ఉపేక్ష తగదు. ఏ దేశమైనా ఉగ్రవాద స్థావరాలకు వేదికలు కారాదు. ఎక్కడ ఆ ప్రయత్నాలు తలెత్తినా, అలాంటి చర్యలను ఆయా దేశాల ప్రభుత్వాలు మొగ్గలోనే తుంచాలని ప్రకటించారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలను కూడా ఉగ్రవాద దేశాలుగా ప్రకటించాలన్న భారత్‌ వాదనకు షాంఘై సదస్సు మద్దతు పలికింది. ఉగ్రవాదం ఏ రూపంలో, ఏ కోణంలో ఉన్నా, అది గర్హనీయం అవుతుంది. ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ ప్రమాణాలు, సాకులు వెతకడం కుదరదు. కేవలం ఈ జటిల సమస్య పరిష్కారమే లక్షంగా అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా సాగాల్సి ఉందని ఈ సదస్సు పిలుపునిచ్చింది. ఇది ఓ రకంగా పాక్‌కు చెంపదెబ్బ. పాక్‌ను సమర్థించిన చైనాకు కూడా ఓ హెచ్చరిక. మొత్తంగా ఈ రెండు విషయాల్లో భారత్‌ ఓ రకంగా దౌత్య విజజయం సాధించిందనే చెప్పాలి.
షాంఘై వేదిక పై ప్రసంగించిన ప్రధాని మోదీ, ఉగ్రవాదం అణచివేతలో శషభిషలు వద్దు, దాటివేతలు, ద్వంద్వ ప్రమాణాలు పనికి రావని తేల్చిచెప్పారు. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పేలవ హాజరీ మధ్య, చైనా అధినేత జిన్‌పింగ్‌, రష్యా అధినేత పుతిన్‌ ఇతర దేశాల అధినేతలతో జరిగిన వార్షిక సదస్సులో భారత ప్రధాని మాట్లాడుతూ, ఉగ్రవాదంపై పోరు, కలిసికట్టుగా మానవీయ కోణంలో జరిపే విద్యుక్త ధర్మంగా గుర్తు చేశారు. పాకిస్థాన్‌కు, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోన్న ఇతరులకు ప్రధాని మోదీ ఈ వేదిక నుంచి నిర్థిష్ట హెచ్చరికలు గట్టిగానే చేశారు.
ఉగ్రవాదాన్ని భారత్‌ తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే భారత్‌ మే 10వ తేదీన ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించింది. ఇందుకు కారణమైన పక్క దేశం పాక్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిందని గుర్తు చేశారు. మిత్రదేశాల కలయికతో సాగే ఎస్‌సిఒ అంటే సెక్యూరిటీ, కనెక్టివిటి ఆపర్చూనిటీ అని భద్రతా అనుసంధాన సమాన అవకాశాల వేదిక ఇది కావాలని పిలుపు ఇచ్చారు. ఎస్‌సిఒ మరింత కీలక శక్తి కావల్సి ఉంది. ఇక్కడ నుంచి ప్రాంతీయ సహకారానికి, ప్రపంచ శాంతి సుస్థిరత భద్రతలకు సరైన పిలుపు వెలువడాల్సి ఉందన్నారు. ఎస్‌సిఒ నుంచి నాగరికతల పరిరక్షణ వేదిక కూడా ఏర్పాటు కావల్సి ఉందని చెప్పారు.
మరోవైపు చైనాలోనే జరిగిన ఈ వేదిక ద్వారా ప్రధాని మోదీ, చైనా ప్రతిపాదిత బెల్ట్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌ పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఇతర దేశాల సార్వభౌమాధికారం, సమగ్రత, ప్రాదేశికతకు సవాలు చేసే, అంశాలు, పరస్పరం విశ్వాసం కోల్పోయే స్థితిక తీసుకువస్తాయని హెచ్చరించారు. ఈ దశలో ఆయన పాక్‌, చైనాలను కలిపి విమర్శించారు. ప్రధాని మోదీ తమ ప్రసంగంలో భారతదేశ ప్రగతి ప్రస్థానం వివరించారు. రిఫార్మ్‌, పర్‌ఫాం, ట్రాన్స్ ఫామ్‌, ఆర్‌పీటీతో కదులుతున్నామని, దీనిని ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియచేస్తానని వివరించారు.
మొత్తంగా షాంఘై సదస్సు ద్వారా భారత్‌ ప్రపంచానికి గట్టి సమాధానమే ఇచ్చింది. ఇది మన దౌత్య విజయం కూడా. అలాగే మన వ్యవహారాలు ఎలా ఉన్నా, కలసి నాడవాలని చైనాకు కూడా సూచించారు. రష్యాతో తమ బంధం విడదీయరానిదని తేల్చి చెప్పారు. ట్రంప్‌ విధిస్తున్న సుంకాలను కలసికట్టుగా ఎదుర్కొనే అవకాశాలను పరోక్షంగా షాంఘై సదస్సు ప్రపంచానిక తెలిపింది. మిగతా దేశాలు కలిసి నడిస్తే నీ పెత్తనం సాగదన్న హెచ్చరికను తెలివిడారు.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News