Tuesday, April 14, 2026
35.2 C
Hyderabad

రాజకీయ అవినీతికి అంతమెప్పుడు!?|EDITORIAL

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తే ఒక చేదు నిజం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నంతసేపు అవినీతికి పాల్పడటం, వేల కోట్లు వెనుకేసుకోవడం, అధికారం కోల్పోగానే అధికార పార్టీ అవినీతిపై పోరాటం చేయడం. ఇది ఇప్పుడు రాజకీయ సంస్కృతిగా మారిపోయింది. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా పరిస్థితి అదే. ఈ రాజకీయ దౌర్భాగ్యం వల్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈరోజు కోలుకోలేని అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.

విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ పాలించిన ప్రధాన రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ లు చేసిన ఆర్థిక దుర్వినియోగానికి బాధ్యత వహించాల్సిందే. అభివృద్ధి పేరుతో తీసుకున్న అప్పులు ప్రజలపై భారంగా మారాయి. కానీ ఈ అప్పులకు కారణమైన రాజకీయ నేతలెవ్వరూ బాధ్యత వహించడంలేదు. రాష్ట్రాలు అప్పుల్లో మునిగిపోతే, రాజకీయ పార్టీలు మాత్రం అధికార మార్పిడితో సురక్షితంగా బయటపడుతున్నాయి.

ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టు ఆరోపణలు, ఈ–కార్ రేసు కేసులు ఈ రాజకీయ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచడంతో బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన “నోటీసులు కాదు, రాజకీయంగా పోరాడుదాం” అన్న వ్యాఖ్యలు చట్టం కంటే రాజకీయ బలం పెద్దదన్న భావనను ప్రతిబింబిస్తున్నాయి. విచారణ ఎదుర్కొనాల్సిన సమయంలో సవాళ్లు విసరడం రాజకీయంగా తప్పించుకునే వ్యూహంగా మారింది.

ఇదే సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ఒకవైపు బీఆర్ఎస్ అవినీతిని ఎండగడుతూనే, మరోవైపు తమ మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు. సింగరేణి సంస్థకు సంబంధించిన టెండర్లు, బొగ్గు కుంభకోణంపై వచ్చిన ఆరోపణలు ప్రభుత్వ పారదర్శకతపై సందేహాలు కలిగిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీలకు వేల కోట్ల టెండర్లు కట్టబెట్టారన్న ఆరోపణలు తేలికగా తీసుకునేవి కావు. వీటిపై స్వతంత్రంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఈ ఆరోపణ–ప్రత్యారోపణల రాజకీయంలో ప్రజల ప్రయోజనం ఎక్కడా కనిపించదు. “వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి” అన్నట్లు, ఒక పార్టీ అవినీతిని మరో పార్టీ అవినీతి ఆరోపణలతోనే ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా నిజం మరింత మసకబారుతోంది. విచారణ సంస్థలు రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నాయన్న భావన ప్రజల్లో బలపడుతోంది. పైగా విచారణాధికారులను నేరుగా బెదిరించడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది.

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాత్ర కూడా ప్రశ్నార్థకమే. రాష్ట్రాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వంగా నిజాయితీగా చర్యలు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. బొగ్గు మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి పాత్ర ఏమిటి? సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు ఎందుకు స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదు? అవినీతి ఆరోపణలు రాజకీయ అవసరాలకే పరిమితమవుతున్నాయా? అన్న అనుమానం తలెత్తుతోంది.

సింగరేణి వంటి కీలక ప్రభుత్వ సంస్థల్లో టెండర్ ప్రక్రియలపై వస్తున్న ఆరోపణలు అత్యంత ఆందోళనకరం. మైనింగ్ టెండర్లు భౌగోళిక పరిస్థితులతో ముడిపడి ఉండటం వల్ల, పారదర్శకత అత్యవసరం. సైట్ విజిట్ చేసిన కంపెనీలకు సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యం, అధికారుల అనిశ్చితి, రాజకీయ జోక్యం వంటివన్నీ అవినీతికి తలుపులు తెరుస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన నైనీ కోల్‌బ్లాక్ టెండర్లలోనూ రాజకీయ అనుబంధాలు ఉన్న కంపెనీలకే లబ్ధి చేకూరిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పాలనలోనూ పునరావృతమవుతుందన్న విమర్శలు వస్తున్నాయి.

ఈ మొత్తం పరిస్థితిని గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. పోలీసులు, అధికార నియంత్రణలో ఉన్న సంస్థలతో రాజకీయ అవినీతికి అడ్డుకట్ట వేయడం అసాధ్యం. అందుకే అన్నా హజారే సూచించినట్లుగా, నిజంగా స్వతంత్రంగా పనిచేసే బలమైన లోక్‌పాల్ వ్యవస్థ అత్యవసరం. అధికారంలో ఎవరు ఉన్నా, ప్రతిపక్షంలో ఎవరు ఉన్నా, భయం లేకుండా విచారణ చేసే వ్యవస్థ ఉండాలి. అప్పుడే రాజకీయ పార్టీలు అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదన్న భయం ఏర్పడుతుంది.

జగన్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎవరు చేసినా అవినీతి అవినీతే. ప్రజలు, మేధావులు, పౌర సంఘాలు కలిసి రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా నిజమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. అవినీతి నుంచి బయటపడాలంటే లోక్‌పాల్ ఒక్కటే శరణ్యం. రాజకీయ సంకల్పం కావాలని నిర్వీర్యమవుతోంటే, ప్రజా ఒత్తిడే ఆ సంకల్పాన్ని సృష్టించాలి. లేదంటే ఈ ఆరోపణల రాజకీయాలు, అవినీతి చక్రం యథాతథంగా కొనసాగుతూనే ఉంటుంది.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News