Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

యూరియాపైనా రాజకీయ అరాచకమేనా!?|EDITORIAL

దేశంలో ఒక విచిత్రం వితండం చేస్తోంది. ఒకవైపు రైతులు తమ చెప్పులు కూడా పెట్టి, గంటలు, రోజుల తరబడి నిలబడి క్యూలైన్లు కడుతున్నారు. మరోవైపు పార్లమెంటులో విపక్ష ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం యూరియాపై పెద్దగా స్పందించడంలేదు. పైగా రైతుల పక్షాన గొంతెత్తిన ఎంపీల గొంతునొక్కుతోంది. ఎదురుదాడికి దిగుతోంది. యూరియా కొరత లేదని బుకాయిస్తున్నది. అన్నదాతలకు, ఆహారంగా వచ్చే పంటలకవసరమైన యూరియాను రాజకీయం చేస్తున్న దురుద్రుష్టం మన దేశంలోనే ఉన్నందుకు సిగ్గులేని మన నేతలను చూసి, మనమంతా సిగ్గుపడాలి.
పంటల సాగుకు అవసరమైన నత్రజని ఎరువులలో యూరియా ప్రధానమైంది. యూరియా వినియోగం పంటల సాగుపై ఆధారపడి ఉంటుంది. వరి, గోధుమ వంటి పంటలకు యూరియా చాలా అవసరం. దేశీయంగా యూరియా ఉత్పత్తి సరిపోనందున, దిగుమతులు కూడా చేసుకుంటున్నాం. యూరియా కొరత పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అది 10 నుంచి 20శాతం వరకు ఉంటుందని అంచనా. రష్యా, అమెరికా, ఉజ్బెకిస్తాన్ దేశాలు అత్యధికంగా ప్రపంచానికి యూరియా ఎగుమతులు చేస్తుండగా, మన దేశం యూరియా వినియోగంలో రెండో అతి పెద్ద దేశంగా ఉంది. మన ఉత్పత్తులకు మించి, అవసరాలు తీరడానికి ఒమన్, చైనా, ఖతార్, రష్యా, సౌదీ అరేబియా నుండి దిగుమతి కూడా చేసుకుంది. అయితే, ప్రభుత్వాల దగ్గర దేశంలో రైతాంగానికి అవసరమైన యూరియా అంచనాలే తప్ప కచ్చితమైన లెక్కలు లేకపోవడం విచాకరమే కాదు. విషాదం కూడా. అయితే దేశంలో ప్రతి ఏటా 3 కోట్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం అవుతున్నట్లు అంచనా. 2023–24 ఏడాదిలో ఒక్క తెలంగాణలోనే 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరగగా, దేశంలో 3కోట్ల 58 లక్షల 80వేల మెట్రిక్ టన్నులు వినియోగించినట్లు కేంద్రం నివేదిక తెలుపుతోంది.
తెలంగాణలో ఖరీఫ్ కి 10 లక్షల 48వేల మెట్రిక్ టన్నులు అవసరముండగా, కేవలం 9 లక్షల 80వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా జరిగింది. ఆగస్టు ఒక నెలలోనే మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉండగా, కేవలం లక్షా 70వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని సమాచారం.

2024 ఖరీఫ్‌లో ఏపీ యూరియా వినియోగం 6.32 లక్షల టన్నులు కాగా 2025లో 6.22 లక్షల టన్నులకు కేటాయింపు తగ్గింది. జులైలో 3.05 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా 2.85 లక్షల టన్నులే వచ్చాయి. ఒకవైపు యూరియా కేటాయింపులు 5 శాతం నుంచి 10శాతం తగ్గుతుండగా, మరోవైపు వినియోగం 15 శాతం నుంచి 20శాతం పెరుగుతోంది.
గత ఖరీఫ్‌లో నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించడంతో సీజన్‌ నెల రోజులు ముందుకొచ్చింది. రైతులు మందస్తుగానే పంటలు వేశారు. దీంతో వినియోగం నెల ముందు నుంచే ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా డిమాండ్ కూడా ముందుగానే పెరిగింది. చాలీచాలని యూరియా తక్కువతోపాటు ఆలస్యంగా అందుబాటులోకి రావడంతో రైతుల ఆందోళన అంతా ఇంతా కాదు. ఇక ప్రభుత్వం రూ.242 రూపాయల నిర్ణయించిన 45 కిలోల యూరియా బస్తా, బ్లాక్ మార్కెట్ లో రూ.350 నుంచి 450 వరకు నడుస్తోంది.
ఇందుకే ఇప్పుడు రైతులు యూరియా అందక క్యూలో నిలబడుతుంటే, పార్లమెంటులో విపక్షాలు యూరియా కేటాయింపుల కోసం తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగాఉన్నందున ఏపీ అధికార కూటమి ఎంపీ ఆందోళనలకు దూరం గప్ చుప్ గా ఉండగా, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణకు ఇంకా 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని, వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా యూరియా కొరత ఇలా ఉండగా, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్, దాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా ఆరోపిస్తోంది. బీజేపీ ఎంపీలు, నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. భారాన్ని రైతుల మీదకు తోసేశారు. అన్నదాతల అవసరాలపై కూడా రాజకీయం చేసే సిగ్గుమాలిన అరాచకం తాండవిస్తుండటం శోచనీయం.
కేంద్రం ఎరువుల కేటాయింపులను తగ్గిస్తుంటే, అధికార ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు మౌనముద్ర దాల్చారు. రైతుల తరపున ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం చేయడం లేదు. ఎన్‌డీఏ ఎంపీలు మాటమాత్రానికైనా ప్రధాని మోదీకి చెప్పలేకపోతున్నారు.
వ్యవసాయరంగంపై సరైన అవగాహన లేని పాలకుల తీరుకారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా ఎంత ఇచ్చాం..ఎంత అవసరం అన్నది కూడా తెలియకుండా విమర్శలతో కాలం గడిపితే నష్టపోయేది రైతులే. రైతులకు అసవరమైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల కోసం రోడ్డెక్కకుండా చూడడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం.
ఎరువులపై రైతులకు ఇచ్చే సబ్సిడీని భారంగా భావించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను తగ్గిస్తూ వస్తోంది. వ్యవసాయం, పర్యావరణం, ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఇందుకు ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. రైతులను చైతన్యపరచడం వంటి తగిన కార్యాచరణ లేకుండానే కోతలు విధించడం, పైగా అమ్మకాలపై ఆంక్షలు పెట్టడం సరికాదు. ధరలు, తెగుళ్లు, నీటికొరత, ఇత్యాది కారణాలతో రైతులు పంటలను మారుస్తున్నారు. యూరియా డిమాండ్‌కు ఇది కూడా కారణం. ఇవన్నీ కలిసి రైతును రోడ్డున పడేస్తున్నాయి.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News