Friday, April 10, 2026
36.2 C
Hyderabad

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA
పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP

తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు శాంతి గీతం వినిపిస్తోంది. దశాబ్దాల కాలంగా మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ప్రాంతాల్లో ఇప్ప్పుడు అభివద్ధి పరుగులు తీస్తోంది. తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతరించిందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ’ఫేస్ టు ఫేస’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కర్రెగుట్టల వంటి మారుమూల ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితులను వివరించారు. ఒకప్ప్పుడు దట్టమైన అడవుల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టుల ఉనికి ఇప్ప్పుడు తెలంగాణలో లేదని డీజీపీ స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ విజయవంతం కావడంతో పాటు, కీలక నాయకత్వం , సైన్యాధ్యక్షులు సైతం బయటకు రావడంతో ఆ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఇప్ప్పుడు ఈ ప్రాంతాలు నక్సల్ రహిత జోన్లుగా మారాయని, ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తెలిపారు. గతంలో కనీస సౌకర్యాలు లేకపోవడమే నక్సలిజం పెరగడానికి ప్రధాన కారణమని గుర్తించిన ప్రభుత్వం, ఇప్ప్పుడు ఆ లోటును భర్తీ చేస్తోంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేని కర్రెగుట్టల వంటి ప్రాంతాలకు ఇప్ప్పుడు బిటి రోడ్ల నిర్మాణం జరుగుతోంది. దీనివల్ల ఆదివాసీలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లడానికి గ్రామస్తుల కోసం ప్రభుత్వం ఒక ఆటో , టూ వీలర్‌ను కమ్యూనిటీ వాహనాలుగా అందజేసింది. గతంలో 12`13 కిలోవిÖటర్లు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి ఇప్ప్పుడు తొలగిపోయింది. ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ఇళ్లకు సోలార్ కందిళ్లను పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం చీకట్లను తొలగిస్తోంది. కనీసం ఆధార్ కార్డులు, ఓటు హక్కు వంటి కనీస గుర్తింపు కూడా లేని ఆదివాసీలకు ఇప్ప్పుడు అన్ని ప్రభుత్వ ఫలాలను అందించడమే లక్ష్యంగా పోలీస్ బాస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని, అటవీ వనరులను కాపాడుకుంటూనే అభివద్ధిని ముందుకు తీసుకెళ్తామని డీజీపీ భరోసా ఇచ్చారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా, అభివద్ధి ద్వారానే మార్పు సాధ్యమని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తోంది. కర్రెగుట్టల వంటి ప్రాంతాల్లో వేసిన రోడ్లు కేవలం రవాణా కోసమే కాదు, ఆ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వేసిన బాటలు అని చెప్పవచ్చన్నారు.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

బట్టల మీద బూరును సాఫ్ శేసే ఇకమతు!?|ADUGU TRENDS

సూటూ, బూటూ గదేనుల్లా... బట్ట తీరు మనిసికి యిలువ. గా బట్టేమో పోగుల తీరును బట్టి ఉంటదాయె. కొన్ని బట్టలు ఎన్ని పైసలు పెట్టి కొన్నా, ఒక్కపాలి ఉతికితిమా? బూరు బూరు లేస్తది....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News