తెలివంటే గీయనదే! ఉపాయమంటే గిదే!! బుర్రనుపయోగిస్తే, మస్తు ఆలోశనలు శేయొచ్చు. ఖర్సూ తగ్గించుకోవచ్చు! ఇగో గీయనేం శేసిండో సూడుండ్లి.

నల్లాలు తిప్పితే నీల్లొచ్చేటందుకు ఇండ్ల మీద, మిద్దెల మీద ట్యాంకులు పెట్టుకుంటం కద. గదాన్నొకటి తీసుకున్నడు. గదాన్ని మంచిగ కోసి, ఓ తలుపు శేసిండు. దానికి కట్కాలు, గొల్లాలు బిగించిండు. ఇగ లోపల పయాఖాన బేసిన్ పెట్టిండు. గదానికే లోపలికి నీల్లొచ్చేటట్లు నల్లాలు పెట్టిండు. ఓ లైటు బుగ్గ పెట్టిండు. గాలిపోయేటందుకు పైన మూతను పెట్టకుండ వదిలేసిండు. అంటే గా ట్యాంకును బాత్ రూం లెట్రిన్ రూం శేసిండన్నట్లు! ఖర్సు తక్కువ, ఉపయోగం ఎక్కువ ఉపాయమన్నట్లు!

