
ఇగో ఇండ్లల్ల పెద్ద పెద్ద అద్దాలుంటే గవాటిని తుడవాలంటే మస్తు పరేషాన్ అయితం. పెద్ద పెద్ద బ్రష్ లు, ఏవేవో వాషర్లు తెస్తం. గవన్నీ ఉన్నా, తుడవాల్నంటే బాగా ఇబ్బందైతది. ఇగ గిప్పుడు గవన్నీ తిప్పలు లేకుండ ఓకాయెనె ఓ ఇకమతు శేసిండు.
అంట్లు, వంట గిన్నెలు తోమడానికి గ రాతెండి పీసు కొంటం కద. గదాన్ని తీసుకోవాలె. గదాన్ని అద్దాలు తుడిసే దానికి ఒడుపుగా పెట్టాలె. ఇగ అద్దం మీద వాషర్ ను స్ప్రే శేయాలె. గదాంతోని కిందికి మీదికి రుద్దాలె. గంతే! శిటికెల గా అద్దాలు సాఫ్ అయితయి. మిలమిల మెరుస్తయి. ఎట్లుంది గీ కిటుకు? మీరూ శేసి సూడుండ్లి. మంచిగుంది కదా! ఏమంటరు?

