Friday, April 10, 2026
36.2 C
Hyderabad

గిదేం తిప్పుడ్రా నాయినా? గదేమన్న మెడా? లబ్బరా!?|ADUGU TRENDS

యెవలన్న తిక్క తిక్కగ మాట్లడితే, తల తిక్కగ వుందా? అంటం. తింగరి తింగరిగ, తిరుగుడు, తిరుగుడుగ, డొంక తిరుగుడుగ మాట్లాడితే, తల గిట్ల తిరుగుతుందా? అంటం. గీ తల తిరుగుడు మాటలతోనేంది గనీ, గా తల నిజంగనే తిరిగితే? యే సాలు తియ్ బయ్! మజాక్ గిట్ల జేస్తున్నవా? మస్తుగంటం గనీ, గా తల తిరుగుతదా యేంది? తిరుగుతున్నట్లనిపిస్తది గంతే! మనం గిర్ర గిర్ర తిరగమా? గప్పుడేమైతది? తల తిరినట్లనిపిస్తది. గని తల తిరగుతాదె? మంచిగ సెప్తనవు. తిరగనే తిరగదు. గప్పడే గద మన బూమి గుండ్రంగ తిరుగుతుందని తెలిసేది!? ఎకెసెక్కెలాడుతున్నవా యేంది? గిదంతా నిజమైతే, గా తల తిరుగుడు గూడ నిజమే!? ఎట్లంటే ఇగ మీర సూడుండ్లి.

గదేనుల్ల… మనిసికి తల ముందుకే సూస్తది. గా మాటకొస్తే, నీ, నా, మనందరి తల గూడ గట్లనె ముందుకే గద సూత్తది. గనీ, గీ పొల్లగాని తల యెనుకకు తిరిగి కూడా సూత్తది. ఆ..! ఎహె తియ్. గదెట్ల? గీ ముచ్చట గమ్మత్ గుంది? ముందుకు సూసే తల యెనుకకెట్ల తిరుగతది? గీ బూమ్మీదొట్టు. గా బూమి తిరిగినట్లే తిరుగుతాంది.

గా ఉత్తర్ పదేశ్ కు చెందిన గీ పోరడు, 18 యేండ్ల సోరోడు. దోస్తులతోని గలిసి సైకిల్ మోటర్ల మీద తిరుగుంటడు. గట్ల పోతుంటునే మధ్యల గిరుక్కున తలను యెనకకు తిప్పుతడు. ఇగ గిది సూసి, గప్పుడు గా సుట్టుపక్కల నుంచి పోయెటోల్లు అప్సోస్ అయితాండ్లంట. గీ వీడెంది? దయ్యమా? మనిషా? అని బయపడతాండ్లంట. గీ సంగత తెలసిన ఒకాయిన గా పోరన్ని యెతికి దొరకబట్టిండు. గవానెంట వాని దోస్తులు గూడ ఉన్నరు. గా పొలగాన్ని నిలబెట్టి, నువ్ నిజంగనే తల తిప్పుతవా? అంటె. ఆ తిప్పుత అన్నడు. నీకేం బయం లేదా? అంటె, లేనే తేదన్నడు. ఎంత మేర తప్పుతవ్? అంటే మొత్తం యెనుకకే తిప్పత. అన్నడు. ఎంతసేపు గంట్లుంట్? అంటే, గదాందేముందు రొండు నిమిషాల్, ఐదు నిమిషాల్, అర గంట గూడ అట్లనే ఉంటనన్నడు.  గిదేదో తమాషాగుందని, తిప్పి సూపమన్నడు. గా పొల్లగాడు గిరుక్కున తలప్పిండు. ముందుకు సూసే తల పూర్తిగ ఎనక్కిపోయింది. గా పోరడు గాడికి ఆగిపోలే, గా యెనక నుంచి గూడ మాట్లాడబట్టిండు. అంతా పరేషాన్ అయిండ్లు. గిట్ల యెప్పుడన్న తిప్పినవా? అంటే లేదు. రొండు నెలల గానుంచే తిప్పుతున్న అన్నడు. ఇగ గిదీన్ని గాయిన యీడియోల దీసిండు. తలను యెనక్కి తిప్పేటప్పుడైతే దగ్గరగ సూపిండు. సొసల్ మీడియల సేర్ సేసిండు.

అరె గిదేంది బయ్? బలే గమ్మత్ గి తప్పిండు? అనుకుంట అంతా సూస్తుండ్లు. సూసినోడు సూసినట్లే పరేషాన్ అయితాండ్లు. గిదేదో మంచిగుందని, గిట్ల తిప్పితే అంతా మనల్నే సూత్తరని, గాయింత మీరు గిట్ల తిప్పేరు? కాసేపు అటు గిటు సూత్తనే మెడలు నొత్తయి. గాయింత గీ ఫీట్ సేత్తిరా? ఇగ యెట్లుంటదో సూడుండ్లి. గా మెడలు పుటుక్కున ఇరుగుతయి. మెడనరాలు సిటుక్కున తెగుతయి. ఇగ తిరుగుడే లేకుండ, యేళ్లాడపడ్తయి. జెర జాగ్రత్త!

https://www.facebook.com/share/r/1676PXi8mG/

 

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News