Friday, April 10, 2026
36.2 C
Hyderabad

ప్రభుత్వ సంక్షోభ హాస్టళ్ళు!|EDITORIAL

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళు సంక్షోభ హాస్టళ్ళుగా మారుతున్నాయి. ఉమ్మడి ఏపీలోలాగే, ఇప్పుడు విడిపోయిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ పెద్దగా మార్పేమీ లేదు. హాస్టళ్ళ ఏర్పాటు, వసతులు, సదుపాయాల కల్పన, ఆహారం, చదువులు, పుస్తకాలు, కాపీలు, నిర్వహణలన్నీ ఓ కల్పనగానే మిగిలిపోతున్నాయి. పైగా ఉన్నతాధికారులు, ప్రభుత్వాల అజమాయిషీ లోపంతో కొందరు ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోయింది. పిల్లల పేరు చెప్పి కొందరు పందికొక్కుల్లా బలుస్తున్నారు. వార్డెన్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్ళల్లో కాలం వెళ్లదీస్తున్న పిల్లల జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియని అయోమయం నెలకొంది.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ హాస్టళ్ళుగా మారుతున్నాయి. ఉమ్మడి ఏపీలోలాగే, ఇప్పుడు విడిపోయిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ పెద్దగా మార్పేమీ లేదు. హాస్టళ్ళ ఏర్పాటు, వసతులు, సదుపాయాల కల్పన, ఆహారం, చదువులు, పుస్తకాలు, కాపీలు, నిర్వహణలన్నీ ఓ కల్పనగానే మిగిలిపోతున్నాయి. పైగా ఉన్నతాధికారులు, ప్రభుత్వాల అజమాయిషీ లోపంతో కొందరు ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోయింది. పిల్లల పేరు చెప్పి కొందరు పందికొక్కుల్లా బలుస్తున్నారు. వార్డెన్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్ళల్లో కాలం వెళ్లదీస్తున్న పిల్లల జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియని అయోమయం నెలకొంది. అమ్మాయిలైతే బలవంతపు అత్యాచారాలకు గురవుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కురుపాం మండల కేంద్రంలోగల గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇద్దరు బాలికలు చనిపోవడం, 138 మంది పచ్చ కామెర్లతో హాస్పిటల్ పాలు కావడం సంక్షేమ హాస్టళ్ళలోని పరిస్థితులకు, నిర్వహణా తీరుకు, ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు అద్దం పడుతున్నది. క్వాంటం కంప్యూటింగ్‌, ఎఐ అంటూ నిత్యం వల్లె వేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ హాస్టళ్ళ దుస్థితి కనిపించకపోవడం దురదృష్టకరం.

గురుకులాలు సమస్యల నిలయాలుగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ హాస్టళ్ళలో ఎక్కువ శాతం కనీస సౌకర్యాల లేవు. బాలికల వసతి గృహాలు సరిపడినన్ని లేక, ఉన్నవి అత్యంత దయనీయంగా వున్నాయి. బోధన, వసతి, సదుపాయాలు అన్నింటికీ ఒకటి రెండు గదులతో సరిపుచ్చు తున్నారు. బాలికల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఎ.ఎన్‌.ఎం లు లేరు. గురుకులాలలో ఉన్నప్పటికీ తగిన మందులు, సౌకర్యాలు లేవు.

పాలకులు మారుతున్నా పరిస్థితులు మారడం లేదు. వార్డెన్‌ పోస్టులు శాశ్వత ప్రాతిపదికన లేనందున ఉపాధ్యాయులే ఒకవైపు బోధన మరోవైపు, పిల్లల బాధ్యత చూస్తున్నారు. మెడికల్‌ ఖర్చు భరించేందుకు తగిన నిధిని సమకూర్చడం లేదు. పిల్లల ఆలనా పాలన చూసే ఆయాలు గాని, టీచర్లు గాని ప్రత్యేకంగా లేకపోవడం వల్ల పిల్లల మానసిక, శారీరక, విద్యా, వైద్య తదితర అంశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
సరైన ఆహారం ఉండదు. సరైన వసతి ఉండదు. నాసిరకం ఆహారంతో వాంతులు విరేచనాలతో పిల్లలు హాస్పిటల్స్ పాలు కావడం, అందులో కొందరు మృత్యువాత పడడం, తల్లిదండ్రులకు క్షోభ మిగులుస్తున్నది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళు అధ్వాన్నంగా ఉన్నాయి. గత పాలన, పదేళ్ళ పాలన, ప్రస్తుత పాలనలో చర్విత చరణంగా అవే తప్పులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం, ప్రతిపక్షంలోకి రాగానే గగ్గోలు పెట్టడం మన పాలకులకు అలవాటైపోయింది. ఏపీలోనూ ఇదే తతంగం నడుస్తోంది. విద్య, వైద్యానికి పెద్దపీట వేయాల్సిన పాలకులు ఓట్‌ బ్యాంకు రాజకీయాలతో సంక్షేమ, ఉచిత పథకాలను కొనసాగిస్తున్నారు.

మారుమూల అటవీ ప్రాంత గిరిజనులకు అక్షరాస్యత అందించాలనే లక్ష్యంతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 46 గిరిజనులకు విద్య, రక్షణ, సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. గిరిజనుల విద్య కోసం ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, గిరిజన ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పి గాలికి వదిలేస్తున్నారు. గిరిజనుల వైద్యాన్ని కూడా పట్టించుకోవడం లేదు. నేటికీ డోలీల్లో సుదూర ప్రాంతాలకు వైద్యానికి గిరిజనులు వెళుతున్నారు. మన్నానికి జ్వరమొచ్చిందనే వార్తాలు ఇంకా వస్తూండటం పాలకులకు సిగ్గుచేటు. షెడ్యూలు ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రకటించింది. అయినా వారి గూడాలకు నేటికీ రోడ్డు లేదు. చదువు, వైద్యం లేదు. ఈ నిర్లక్ష్యం సంక్షేమ హాస్టళ్ళపై కూడా కొనసాగుతున్నది. ఆశ్రమ పాఠశాలల్లో తాగునీరు లేక, మరుగుదొడ్లు లేక రోగాల బారినపడి చనిపోయిన ఘటనలను చూస్తున్నాం.

నిజానికి గిరిజనులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలను ఏర్పాటు చేసి మెరుగైన విద్యను అందివ్వాలి. తద్వారా సామాజికంగా, ఆర్థికంగా మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించే చర్యలు చేపట్టాలి. బడులు లేక, ఉన్నా బడుల్లో టీచర్లు లేక, అసంపూర్ణ భవనాలు, చాలీచాలని వసతుల దుస్థితికి స్వస్తి పలకాలి. విష జ్వరాలు, పచ్చకామెర్లు, మలేరియా వంటి అనారోగ్యాలతో పిల్లలు పిట్టల్లా రాలిపోవడాన్ని తక్షణమే అరికట్టాలి. ఎప్పటికప్పుడు మౌలిక వసతులు కల్పనకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, పోషక విలువలతో కూడిన మెనూ చార్జీల పెంపునకు నిధులు ఇవ్వాలి. భావి భారత ఆశాకిరణాలైన పిల్లల భవిష్యత్తుపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఆ భావి భారతాన్ని నేటి నుంచే తీర్చిదిద్దడం మొదలు పెట్టాలి.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News