Friday, April 10, 2026
36.2 C
Hyderabad

అమెరికాలోనూ ట్రంప్‌ కు వ్యతిరేకత!|EDITORIAL

అధికారాంతమున చూడవలె అయ్యవారల ఆగడములు.. అన్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం అధికారంలో ఉండగానే చూడకూడనివి కూడా చూసేస్తున్నారు. ఇంటా బయటా భయంకరమైన వ్యతిరేకతను మూట గట్టుకుంటున్నారు. ఏడాది తిరగక ముందే ఆయనకు, ఆయన రిపబ్లకన్ పార్టీకి అమెరికాలోనే వ్యతిరేకత వెల్లువెత్తుతుండటం ఆయన వ్యవహార శైలికి నిదర్శనం. ట్రంప్ తీరుపై అసహనం అమెరికా ప్రజల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రపంచ నాయకత్వం వహించాల్సిన స్థితిలో ఆయన దేశాన్ని అంతర్గతంగా విభజించి, అంతర్జాతీయంగా ఒంటరిని చేశాడు. అమెరికా ‘ప్రపంచానికి పెద్దన్న’ పాత్రను కోల్పోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు, ట్రంప్‌కు వ్యతిరేకంగా గట్టిగా పలికిన ప్రజా స్వరం.

మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

అధికారాంతమున చూడవలె అయ్యవారల ఆగడములు.. అన్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం అధికారంలో ఉండగానే చూడకూడనివి కూడా చూసేస్తున్నారు. ఇంటా బయటా భయంకరమైన వ్యతిరేకతను మూట గట్టుకుంటున్నారు. ఏడాది తిరగక ముందే ఆయనకు, ఆయన రిపబ్లకన్ పార్టీకి అమెరికాలోనే వ్యతిరేకత వెల్లువెత్తుతుండటం ఆయన వ్యవహార శైలికి నిదర్శనం.
అమెరికా రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా కుడి పక్ష రాజకీయాల పరాకాష్టగా ఉండేది. కానీ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత ఏడాదిలోనే తన తీరు, వ్యాఖ్యలు, ఆగ్రహపూరిత వైఖరితో, యుద్ధ కాంక్షతో, శాంతి ప్రవచనాలతో విస్తృతమైన వ్యతిరేకతను సంపాదించుకున్నారు. ఇప్పుడీ వ్యతిరేకత అమెరికా స్థానిక ఎన్నికల్లో ప్రస్ఫుటించింది. అమెరికాలో కొత్త రాజకీయ శకం ప్రారంభమవుతోందా?

ట్రంప్ తీరుపై అసహనం అమెరికా ప్రజల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రపంచ నాయకత్వం వహించాల్సిన స్థితిలో ఆయన దేశాన్ని అంతర్గతంగా విభజించి, అంతర్జాతీయంగా ఒంటరిని చేశాడు. అమెరికా ‘ప్రపంచానికి పెద్దన్న’ పాత్రను కోల్పోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు, ట్రంప్‌కు వ్యతిరేకంగా గట్టిగా పలికిన ప్రజా స్వరం.
మొన్న అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ గెలుపులు రిపబ్లికన్ శిబిరంలో కలకలం రేపాయి. న్యూయార్క్, వర్జీనియా, న్యూజెర్సీ వంటి కీలక రాష్ట్రాల్లో డెమోక్రాట్లు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆసియా, ఆఫ్రికా సంతతికి చెందిన పౌరులు ప్రజల మద్దతుతో గెలవడం జాత్యహంకారం, వర్ణవివక్షపై ప్రజాస్వామ్య విలువల విజయగీతంలా మారింది.

న్యూయార్క్ మేయర్ గా జోహ్రాన్ మమ్దానీ విజయం ట్రంప్‌కు నైతికంగా పెద్ద ఎదురుదెబ్బ. వలసల వ్యతిరేకత, ముస్లింలపై విరోధం, సంపన్నులపై సానుకూలత కలగలిసిన ట్రంప్ రాజకీయాలు మమ్దానీ ఓ ప్రజా నాయకుడిగా ఎదగడంలో మరింత బలంగా పనిచేశాయి.

న్యూయార్క్ మహానగరం. అమెరికా ఆర్థిక, సాంస్కృతిక గుండెకాయ. 90 లక్షల జనాభా, 254 బిలియన్ డాలర్ల బడ్జెట్ ఉన్న ఈ నగర మేయర్ పదవికి యువ నాయకుడు మమ్దానీ ఎన్నికవడం చారిత్రాత్మకం. డెమోక్రాటిక్ సోషలిజం సిద్ధాంతాన్ని నమ్మిన ఆయన, ‘అమెరికాకు కుబేరులు కాదు, ప్రజలే బలం’ అని ధైర్యంగా ప్రకటించారు.అతని వైఖరి సంపన్న వర్గాలను అసహనానికి గురి చేసింది. పెద్ద వ్యాపారవేత్తలు కోట్ల డాలర్లతో ప్రచారాన్ని నడిపి ఆయనను ఓడించాలనుకున్నారు. కానీ పేద ప్రజల చిన్నచిన్న విరాళాలతో మమ్దానీ ప్రచారం జరిపి, చివరకు విజయం సాధించారు.

ఎన్నికల సమయంలో ట్రంప్ మమ్దానీని ‘కమ్యూనిస్టు ముప్పు’గా వర్ణించి, ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నించారు. ‘మమ్దానీ గెలిస్తే నగరానికి నిధులు ఇవ్వను’ అని బెదిరించారు. కానీ ప్రజలు ఈ భయోత్పాత రాజకీయాన్ని తిప్పికొట్టారు. ట్రంప్ జాతీయవాద నినాదాలకు బదులుగా మమ్దానీ ప్రజాస్వామ్య, సంక్షేమ వాగ్దానాలను విశ్వసించారు.

‘అణ్వస్త్రాల కన్నా ప్రజలకు అన్నవస్త్రాలు ముఖ్యం’ అన్న మమ్దానీ నినాదం ప్రజల్లో ప్రగాఢ నమ్మకాన్ని రేకెత్తించింది. వలసదారుల హక్కులు, విద్య, వైద్య సదుపాయాలు, గృహవసతి వంటి అంశాలను ఆయన ప్రధాన అజెండాగా పెట్టుకోవడం, వలస వర్గాల్లోనూ, యువతలోనూ విస్తృత మద్దతు లభించింది.
ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక వలస వ్యతిరేక విధానాలు కఠినంగా అమలయ్యాయి. ముస్లిం దేశాల పౌరులపై వీసా నిషేధాలు, వలసదారుల శిబిరాలపై దారుణ చర్యలు, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం వంటి నిర్ణయాలు బయటి దేశాల్లోనేగాక సొంత దేశంలోనూ విపరీతమైన అసహనాన్ని కలిగించాయి.
ఈ నేపథ్యంలో మమ్దానీ, గజాలా హష్మీ, ఆఫ్తాబ్ పురేవాల్ వంటి వలస సంతతికి చెందిన నాయకుల విజయాలు అమెరికా సమాజంలో మారుతున్న ఆలోచనా ధోరణికి సంకేతం. ఇది కేవలం వ్యక్తిగత విజయమేగాక, వలసదారుల గౌరవం, సమాన హక్కుల సాధనలో ప్రజాస్వామ్య విజయగీతం.
న్యూయార్క్ లో మమ్దానీతో పాటు వర్జీనియాలో గజాలా హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా, సిన్‌సినాటీలో ఆఫ్తాబ్ పురేవాల్ రెండోసారి మేయర్‌గా గెలవడం డెమోక్రాట్లలో కొత్త ఉత్సాహానికి నాందీ పలికింది. వీరంతా మధ్యతరగతి, వలసదారుల వర్గాల నుండి ఎదిగిన నేతలు కావడం, ప్రజా శ్రేయస్సు, సంక్షేమంపై ఆధారపడి ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం.

ఒకరకంగా ఇది అమెరికా రాజకీయాల్లో ‘డబ్బు ఆధిపత్యం’పై మొదలైన ప్రజాస్వామ్య తిరుగుబాటుగా అభివర్ణించవచ్చు. “బెర్నీ శాండర్స్” తరహా మితవాద సామాజిక సిద్ధాంతాలు మళ్లీ ప్రాముఖ్యం పొందుతున్నాయని భావించవచ్చు. మమ్దానీ కూడా తన విజయాన్ని ‘చీకటిలో కాంతిరేఖ’గా అభివర్ణించడం ఈ మార్పుకు ప్రతీక.

మమ్దానీ విజయం కేవలం న్యూయార్క్ కే పరిమితం కాలేదు. అమెరికా రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రిపబ్లికన్ పార్టీ ఉడుం పట్టులో బిగుసుకుపోయిన రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య చైతన్యాన్ని మళ్లీ వెలిగించింది. ట్రంప్ విద్వేష రాజకీయాల పరాకాష్టపై ప్రజల తీర్పు ఇది.
సామాన్యుల సమస్యలే దేశ బలం అని చాటిన మమ్దానీ, ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ అనే ట్రంప్ నినాదాన్ని తలకిందులు చేశారు. ‘అమెరికా గొప్పది అవ్వాలంటే, ప్రజల జీవితాలు గొప్పవిగా మారాల’ని మమ్దానీ అంటున్నారు.

అమెరికాలో మమ్దానీ, హష్మీ, పురేవాల్ విజయాలు ట్రంప్ రాజకీయాలకు చెంపపెట్టు లాంటివి. ఈ విజయాలు అమెరికా సమాజంలో వలసదారుల, మైనారిటీల, యువత యొక్క కొత్త ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ట్రంప్ అనుసరిస్తున్న వలస, ముస్లిం వ్యతిరేక రాజకీయాలు ఎంతో కాలం మనజాలవని ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు.

అమెరికా ప్రజాస్వామ్యంలో విభజన, విద్వేషం కాదు, ఐక్యత, మానవతా విలువలే ముఖ్యమని, ట్రంప్‌ రాజకీయాలను తిప్పికొట్టి, మమ్దానీ వంటి నేతలు ప్రజాస్వామ్యాన్ని, సమానత్వాన్ని తిరిగి ప్రజల హృదయాల్లో నాటుతున్నారు. అమెరికా రాజకీయాల్లో ఈ కొత్త ఆలోచనలు ఒక చరిత్రాత్మక మలుపు. మమ్దానీ విజయంతో ప్రారంభమైన ఈ మార్పు, అమెరికా మాత్రమే కాదు ప్రపంచ ప్రజాస్వామ్యాలకు కూడా ప్రేరణగా నిలుస్తోంది.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News