ఇండ్లల్ల గ్యాస్ అయిపోయిందని తెల్వంగనే పక్కన పడేత్తం. కనీ, గా గ్యాస్ అయిపోయిందా? లేదా అని సూడాల్నంటే, గా మూత తీయాలె. గది తీయాల్నంటే మస్తు భయమైతది. కనీ, గా మూత తీసుడు ఎంత అల్కనో మీరే సూడుండ్రి.

ఒక తాళం చెయిని తీసుకోవాలె. గీ పోటువల సూపినట్లు… గా తాళం చెయిని, గా సిలండర్ కు పైపు బిగించే దాని సందుల కెల్లి తీయాలె. ఇగ మెల్లెగ గా తాళం చెయిని కింద ఉండే ప్లాస్టిక్ మూత కింది దాకా తీసుకపోయి, ఒక్కపాలె పైకి ఒత్తాలె. గంతే గది టపుక్కున లేస్తది. గీ ఇకమతు మంచిగుంది కదా?

