కొత్తకొత్త కార్లు కొనుక్కుంటం. గవాటికి టక్కర్ కాకుండా, గీతలు పడకుంట మంచిగ సూసుకుంటం. కనీ, ఎంత జాగ్రత్త పడినా, ఏదో గీత పడతనే ఉంటది. మనం సక్కగుంటే, ఎదుటోడు గూడ సక్కగుండాలె గద.
మరి గిసొంటి గీతలు పడితే ఏం చేయాలె? గవాట్ని గట్లనే వదిలేయొద్దుల్లా. షెడ్డుకు తీసుకపోయి రంగేస్తే అతుకుల బొంత లెక్కనే గొడ్తది. మొత్తం ఏయాల్నంటే కర్సైతది. గిదంత లేకుండ, ఓకాయన మంచి ఇకమతు కనిపెట్టిండు. ఇగో కార్లకు గీతలు పడంగనే, గింత పెట్రోలు తీస్కోవాలె. గింత గుడ్డపేగుకో లేకపోతే గిత దూదికో గా పెట్రోల్ ని అంటియ్యాలె. గదాంతోని మెల్లగా గీత మీద రుద్దాలె. గంతే, గా గీత కనిపించకుండపోవుడే గాదుల్లా… అంతా కలగలిసి, అసల్ సిసల్ గా రంగేసినట్లు కొత్తగా కనిపిస్తది. ఎట్లుంది గీ ఇకమతు?
గిదీంతో రుద్దితే, గా గీతలు మాయం!?|ADUGU TRENDS

