Wednesday, April 8, 2026
35.2 C
Hyderabad

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. తెలంగాణలో మూసీ ప్రక్షాళన, ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నిర్మాణం చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు, జరుగుతున్న పరిణామాలు విపరీతంగా ఉన్నాయి. అభివృద్ధి అంశాలను రాజకీయ లాభనష్టాలతో బేరీజు వేసే ధోరణి పెరిగితే, దీర్ఘకాల ప్రయోజనాలు పక్కనపడి తాత్కాలిక ప్రయోజనాలే ప్రాధాన్యం సంతరించుకుంటాయి.

తెలంగాణలో మూసీ నది ప్రక్షాళన అనివార్యం. అరమరికలు అవసరం లేని వాస్తవం. హైదరాబాద్ నగరం నుంచి రోజుకు 1,400 నుండి 1,600 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో ఎక్కువ భాగం నేరుగా మూసీలో కలుస్తోంది. ఇది పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రక్షాళన చర్యలు అత్యవసరం. అయితే, ఈ ప్రాజెక్ట్‌ పై రాజకీయ వివాదాలు నెలకొనడం ఆందోళనకరం. అధికార పార్టీ పట్టుదలతో ముందుకు వెళ్లాలనుకుంటే, ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపకుండా, కేవలం వ్యతిరేకతకే పరిమితం కావడం విడ్డూరం.

నిర్వాసితుల సమస్య సున్నితమైంది. ఏ అభివృద్ధి ప్రాజెక్ట్ అయినా ప్రజల సహకారం లేకుండా సాధ్యం కాదు. అందుకే “ఇల్లుకు ఇల్లు, భూమికి భూమి” అనే విధంగా సరైన పునరావాస విధానం ఉండాలి. గత అనుభవాల ప్రకారం సరైన పరిహారం ఇవ్వకపోతే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైన విధానం కాదు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ వివాదాల కేంద్రంగా మారింది. 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం, తరువాత దానిపై స్పష్టత లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ నిలిచిపోయింది. 33 వేల ఎకరాల భూమి రైతులు ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడం వల్ల వారి ఆశలు కూడా నిలిచిపోయాయి. రాజధాని నిర్మాణం అంటే కేవలం భవనాలు కాదు. అది సామాజిక, ఆర్థిక, పరిపాలన అభివృద్ధికి కేంద్ర బిందువు.

అభివృద్ధి నిరంతర ప్రక్రియ. హైదరాబాద్ నగరం ప్రస్తుత స్థాయికి చేరుకోవడానికి శతాబ్దాల చరిత్ర ఉంది. అదే విధంగా అమరావతి కూడా ఒక్కరోజులో మహానగరంగా మారదు. దీర్ఘకాల ప్రణాళిక, స్థిరమైన విధానాలు అవసరం. కానీ రాజకీయ మార్పులతో ప్రాజెక్ట్ ల దిశ మారిపోతే పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోతుంది. ప్రభుత్వాల పట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం ప్రధాన ఆదాయ వనరు. కానీ, సమగ్రంగా అభివృద్ధి చెందిన రాజధాని నగరం ఉంటే, రాష్ట్ర ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. అంచనాల ప్రకారం, సరైన ప్రణాళికతో అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశముంది. ఇది ఉపాధి అవకాశాలను కూడా విస్తరించగలదు.

రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అవసరాలను ముందుంచాలి. కేవలం సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి సాధ్యం కాదు. రేషన్, ఉచిత బస్సు, నగదు పంపిణీ వంటి పథకాలు తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు అవసరం. అదే సమయంలో సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం కూడా సరికాదు. రెండింటి మధ్య సమతౌల్యం, సమన్వయం అవసరం.

ఇందులో అధికార పక్షం సహా, ప్రతిపక్షాల పాత్ర కూడా కీలకం. ప్రతిపక్షాలు కేవలం విమర్శలకు పరిమితం కాకుండా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి. ఇక ప్రభుత్వం కూడా పారదర్శకత. భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు వస్తున్నప్పుడు వెంటనే స్పందించాలి. నిశ్శబ్దం అనుమానాలకు తావిస్తుంది. విశ్వసనీయత కోల్పోతే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రశ్నార్థకంగా మారతాయి.

రాజకీయాలు అభివృద్ధిని నడిపించాలి గాని అడ్డుకోకూడదు. నాయకులు తాత్కాలిక రాజకీయ, లాభాల కోసం కాకుండా, దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాల కోసం ఆలోచించాలి. ప్రజలు కూడా భావోద్వేగాలకు లోనుకాకుండా దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే రాష్ట్రాలు నిజమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయి. లేదంటే రాజకీయాల కలుషిత ప్రభావంలో అభివృద్ధి అనే లక్ష్యం ఎప్పటికీ నెరవేరని కలగానే మిగిలిపోతుంది.

Latest News

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

బట్టల మీద బూరును సాఫ్ శేసే ఇకమతు!?|ADUGU TRENDS

సూటూ, బూటూ గదేనుల్లా... బట్ట తీరు మనిసికి యిలువ. గా బట్టేమో పోగుల తీరును బట్టి ఉంటదాయె. కొన్ని బట్టలు ఎన్ని పైసలు పెట్టి కొన్నా, ఒక్కపాలి ఉతికితిమా? బూరు బూరు లేస్తది....

కెజి బేసిన్ – మన గ్యాస్ మన హక్కు!|EDITORIAL

పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన, సహజవాయువు సరఫరా వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల ప్రభావం మన దేశంతోపాటు అన్ని దేశాలపైనా,...

07-04-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి మధ్యాహ్నం 01.49 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 03.21 వరకు ఉపరి మూల యోగం వ్యతీపాత మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి వరీయాన్ కరణం తైతుల మధ్యాహ్నం...

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

గిట్లంటే, గీ గ్యాస్ సిలండర్ మూతొత్తది!?|ADUGU TRENDS

ఇండ్లల్ల గ్యాస్ అయిపోయిందని తెల్వంగనే పక్కన పడేత్తం. కనీ, గా గ్యాస్ అయిపోయిందా? లేదా అని సూడాల్నంటే, గా మూత తీయాలె. గది తీయాల్నంటే మస్తు భయమైతది. కనీ, గా మూత తీసుడు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News