Wednesday, April 8, 2026
34.2 C
Hyderabad

కేంద్రమా? ‘స్థానిక’ ఆమోదమా!?|EDITORIAL

స్థానిక ఎన్నికల నిర్వహణకు HIGH COURT| హైకోర్టు లైన్‌ క్లీయర్‌ చేయడంతో పాటు, డెడ్‌లైన్‌ కూడా విధించింది. మరోవైపు 42శాతం BC| బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని BRS| బీఆర్‌ఎస్‌, BJP| బీజేపీ డిమాండ్‌ చేస్తున్నాయి. కుల గణన చేసి చరిత్ర సృష్టించామని, మోడీకి సవాల్‌ విసిరామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల అమలు అంత సులువు కాదు. ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పు, రెండోవైపు పార్లమెంటు ఆమోదం తప్పనిసరైన పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు దీనికి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ఎన్నికలను THREE MONTHS| 3 నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్డు గడువు విధించడంతో బీసీ రిజర్వేషన్ల అమలుపై STATE GOVERNMENT| రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెరిగింది. అంతటా ఉత్కంఠ పెరిగింది.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు CONGRESS| కాంగ్రెస్‌ ప్రభుత్వం, EDUCATION| విద్య, JOBS| ఉద్యోగాల్లో, LOCAL BODY| స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఉభయ సభల్లో తీర్మానించి, రాష్ట్రపతి ఆమోదం కోసం ఇప్పటికే కేంద్రానికి పంపించింది. ప్రస్తుతం ఈ రెండు బిల్లులు అక్కడే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఆమోదింప చేయాలని ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. కిషన్‌రెడ్డి ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. అయితే బీసీ కుల గణన అంతా తప్పుల తడకగా ఉందని బీజేపీ వాదిస్తోంది. బీజేపీ ప్రభత్వం కూడా దేశ వ్యాప్తంగా జన గణనతోపాటు కుల గణనకు పూనుకుంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లేదా పదేపదే ప్రకటస్తున్న మేరకు రాష్ట్ర ప్రభుత్వమే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని ఎలా అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు గతంలో 7.5శాతమే ఉండగా, ప్రస్తుతం 10శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తే మిగతా రిజర్వేషన్లను కలుపుకుని మొత్తం రిజర్వేషన్లు 70 శాతం చేరే అవకాశం ఉన్నది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా, కేంద్రాన్ని కాదని బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేసినా, అవి అమలు అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్‌ చేస్తే మొత్తం ఎన్నికల పక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉన్నది. కేంద్రం ఆమోదం లేకుండా 42శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు. అది కాకుంటే స్థానికంగా ఎన్నికల్లో రిజర్వేషన్లు కూడా సాధ్యం కాదు. అందువల్ల పార్టీ పరంగా 42శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామనే ప్రకటన చేయడం మినహా కాంగ్రెస్ కు మరో మార్గం కనిపించడంలేదు. బీసీ రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించి, 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా తమిళనాడుకు కల్పించినట్లే తమకు రక్షణ కల్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. కానీ కేంద్రం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలు, రాజకీయ కారణాలు లాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును గత మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ అమోదించింది. కానీ ఈ నిర్ణయం రాష్ట్ర పరిధిలో అమలు చేయగలిగింది కాకపోవడంతో గవర్నర్‌ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించి, ఆచితూచి అడుగేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపైనా ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. అయితే రాజ్యాంగ పరంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరవాతే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో రాష్ట్రపతి కూడా న్యాయ సలహాకు పంపవచ్చు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు స్థానికంగానే అమలు సాధ్యమా? అన్న విషయం కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల వచ్చే న్యాయపరమైన చిక్కులపైనా ప్రభుత్వం ఆరా తీస్తున్నది.

నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ మూడు నెలల్లో కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవచ్చు. అందువల్ల పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమ మార్గం. పైగా ప్రతిపక్షాలపై కూడా ఆవిధంగా ఒత్తిడి పెంచవచ్చు. హైకోర్టు తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. హైకోర్టు తీర్పుపై సీఎస్‌ రామ కృష్ణారావు పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి నుంచి ఎలాంటి ఆమోదం రాకుంటే, తమిళనాడు తరహాలో సుప్రీంకోర్టు మెట్లెక్కాలని కొందరు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. తెలంగాణలో కులగణన, బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులపై కేంద్రం పెద్దగా స్పందించడం లేదు. ఈదశలో బీసీ రిజర్వేషన్ల బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Latest News

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

బట్టల మీద బూరును సాఫ్ శేసే ఇకమతు!?|ADUGU TRENDS

సూటూ, బూటూ గదేనుల్లా... బట్ట తీరు మనిసికి యిలువ. గా బట్టేమో పోగుల తీరును బట్టి ఉంటదాయె. కొన్ని బట్టలు ఎన్ని పైసలు పెట్టి కొన్నా, ఒక్కపాలి ఉతికితిమా? బూరు బూరు లేస్తది....

కెజి బేసిన్ – మన గ్యాస్ మన హక్కు!|EDITORIAL

పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన, సహజవాయువు సరఫరా వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల ప్రభావం మన దేశంతోపాటు అన్ని దేశాలపైనా,...

07-04-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి మధ్యాహ్నం 01.49 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 03.21 వరకు ఉపరి మూల యోగం వ్యతీపాత మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి వరీయాన్ కరణం తైతుల మధ్యాహ్నం...

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News