Friday, April 3, 2026
30.2 C
Hyderabad

భద్రత సరే, అనుమానాల సంగతేంటి!?|EDITORIALS

భిన్నాభిప్రాయాలు, బేదాభిప్రాయాలు, రాజకీయా విభేదాలు ఏమున్నా, ఎన్ని ఉన్నా, దేశానికి సంబంధించిన అంశాల్లో మనమంతా ఒక్కటే! ముక్తకంఠంతో మనమంతా ఐక్యమే. అని చాటాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఎన్ని రకాల బాధ్యతలు, ఒత్తిడిలు ఉన్నప్పటికీ ప్రతిపక్షాల అనుమానాలను నివ్రుత్తి చేయాలి. ప్రతిపక్షాలు సైతం దేభద్రత, రక్షణకు సంబంధించిన అతి ముఖ్యమైన, సున్నితమైన అంశాల్లో సంయమనం పాటించాలి. తప్పితే, అధికార ప్రతిపక్షాల్లో ఉన్నవారు దేశం కంటే, ప్రజలకంటే ఎవరూ ముఖ్యం కాదు. అదే అసలైన దేశభక్తి. అదే అసలైన జాతీయత.|EDITORIALS

దేశ సార్వభౌమాధికారం విషయంలో ఎవ్వరైనా ఏకోన్ముఖంగా సాగాల్సిందే. ఒక్కటిగా ఉండాల్సిందే. అంతర్జాతీయ విషయాల్లో ఇది ప్రతిఫలించాలి. ఇటీవలి పాక్‌తో కాల్పుల ఘటనపై అందరూ ఒక్కతాటిపైనే ఉన్నారు. అయితే తర్వాత పరిణామాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీల వ్యాఖ్యలు పలు అనుమానాలను లేవనెత్తాయి. పహల్గాం దాడి విషయంలో హిందువువేనా అని నిర్దారించుకుని కాల్పులు జరిపారు. దీనిపై కొందరు నేతలు అనుమానాలు లేవనెత్తారు. అదంతా ఉత్తిదేనని, అలాంటిదేవిూ జరగేలదని కొందరు అన్నారు. ఇప్పుడేమో ఖర్గే, అది చిన్న యుద్దమే అన్నారు. రాహుల్‌ మనవి ఎన్ని విమానాలు కూలాయని ఆరా తీస్తున్నారు. అంతేకాదు భారత్‌-పాకిస్తాన్‌ ఘర్షణలతో అర్థాంతరంగా కాల్పుల విరమణకు ఒప్పుకోవడం వెనక కారణాలు చెప్పాలని కూడా కాంగ్రెస్‌, మిగతా కొన్ని పక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ గోప్యతకి సంబంధించిన వ్యవహారాలు. కాదనలేం. కానీ, ప్రతిపక్షాలకు ఆ అనుమానాలు రేకెత్తే ఆస్కారం అధికార పక్షం లేదా ప్రభుత్వం ఎందుకు ఇచ్చినట్లు? అంతకుముందే అఖిలపక్షం పెట్టి, చెప్పదగిన సమాచారం ప్రతిపక్షాలకు వెల్లడి చేస్తే సరిపోయేది. ఆ తర్వాత కూడా ఆయా పార్టీలు వ్యక్తం చేస్తే, అది వారి ఖర్మకు వదిలేస్తే సరిపోయేది. పుండును చూసి ఉప్పు కారం చల్లడం ప్రధాని మోడీకి బాగా తెలిసిన విద్య. సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ను దగ్గరకు తీసుకుంటున్న మోడీ వ్యూహాత్మకంగా శశిథరూర్‌ సామర్థ్యాన్ని విదేశీ దైత్యానికి వెళ్లే బృందంలో ఎంపిక చేసి కాంగ్రెస్ ను గిల్లుతున్నారు. గతంలో ఐక్యరాజ్యసమితిలో పనిచేసిన అనుభవం థరూర్‌కు ఉందన్నది వేరే విషయం.|EDITORIALS

ఇక అమెరికా తీరు కూడా హాస్యాస్పదంగా ఉంది. పాక్‌, భారత్‌ ఘర్షణలతో తమకు సంబంధం లేదంటూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అకస్మాత్తుగా తామే రెండు దేశాలను ఒప్పించి, కాల్పుల విరమణకు దోహదం చేశామని చెప్పుకోవడం, తర్వాత తన ప్రమేయం లేదని ఒప్పుకోవడం విడ్డూరమే. అయితే ఈ విషయంలో మోడీ నోరు విప్పకపోవడం గమనిస్తే అనుమానాలు రేకెత్తడం సహజమే. అమెరికా అంత అకస్మాత్తుగా ఎందుకు కాల్పుల విరమణ జరపాలని రెండు దేశాలపై ఒత్తిడి తెచ్చిందన్నది కూడా ముఖ్యమే. అదే అమెరికా ఇజ్రాయిల్‌ను, రష్యాను ఇలాంటి సందర్భాల్లో ఒత్తిడి చేయలేక పోయింది. తన మాట వినకపోతే వాణిజ్య సంబంధాలు నిలిపివేస్తామని బెదిరించడంతో రెండు దేశాలు దారికి వచ్చాయని స్వయంగా ట్రంప్‌ పేర్కొనడం గమనార్హం.|EDITORIALS

ఇదే సమయంలో పాకిస్తాన్‌ అణు స్థావరంగా భావిస్తున్న కిరానా హిల్స్‌ వద్ద భారత్‌ వైమానిక దళం క్షిపణులు ప్రయోగించడంతో అణుధార్మికత లీక్ అయిందని, దీంతో అమెరికా రంగంలోకి దిగి ఒత్తిడి తెచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, అక్కడ అణు స్థావరం ఉన్నట్లు తమకు తెలియదని, ఆ ప్రాంతంలో అసలు తాము క్షిపణులనే ప్రయోగించలేదని భారత వైమానిక దళాధికారి స్పష్టం చేశారు. కిరానా హిల్స్‌ లో ఎలాంటి లీకేజీ లేదని ‘ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ చెబుతోంది. అసలు కిరానా హిల్స్ పై వస్తున్న వార్తలపై పాకిస్తాన్‌ ఎందుకు మౌనం పాటిస్తోంది? దాయాది దేశం కిరానా హిల్స్‌ విషయంలో ఏమైనా దాచిపెడుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్‌ భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగించడానికి సిద్ధమవుతుండగా, కట్టడి చేసేందుకు భారత్‌ క్షిపణి ప్రయోగించిందనే కథనాలు కూడా వెలువడ్డాయి. అణుదాడుల గురించి దాయాది దేశం నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తాజాగా తేల్చి చెప్పారు. మరోవైపు పాక్‌ అణుదాడి హెచ్చరికలను ప్రధాని మోడీ కూడా కొట్టిపారేశారు. ఇలాంటి హెచ్చరికలతో భారత్‌ను బెదరించలేదరని అన్నారు. కిరానా హిల్స్‌ ప్రాంతంలో అణ్వస్త్రాల స్థావరం ఉందని, రెండు దేశాల ఘర్షణ ఆ ప్రాంతానికి ఎక్కడ విస్తరిస్తుందో అన్న భయంతోనే కాల్పుల విరమణ జరిగే విధంగా రెండు దేశాలకు అమెరికా నచ్చచెప్పే ప్రయత్నం చేసిందని భావించాల్సి వస్తుంది. రష్యా- ఉక్రెయిన్‌ మధ్య శాంతి స్థాపన మాదిరిగా సుదీర్ఘంగా చర్చలతో కాలయాపన చేయకుండా తక్షణమే అమలులోకి వచ్చే విధంగా ప్రయత్నం జరిగిన్నట్లు స్పష్టం అవుతుంది. విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో ఈ ఘర్షణలతో జరిగిన దాడులు, నష్టాల వివరాల గురించి పలువురు ఎంపీలు ప్రశ్నించగా ‘జాతీయ భద్రత’ దృష్ట్యా అటువంటి వివరాలు వెల్లడించలేమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పేర్కొనడం గమనార్హం.|EDITORIALS

ఏదేమైనా ఇటీవల చోటు చేసుకున్న భారత్‌ పాకిస్థాన్‌ ఘర్షణలకు సంబంధించి ప్రభుత్వ వాదనను కాదనలేం. కానీ, వెల్లువెత్తుతున్న అనుమానాలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కనీసం తాము నిజాయితీగా దేశ రక్షణ కోసం పని చేస్తున్నామన్న భరోసాని, నమ్మికను కలిగించాలి. దేశ భద్రత ముడిపడి ఉన్న అంశాలపై ఎవరైనా సరే, ఆచితూచి మాట్లాడితే మంచిది. ఇలాంటి సమయంలో అనవసర వ్యాఖ్యలు చేసి ప్రపంచం ముందు మనం పలచన కావద్దు. మనలను మనం చులకన చేసుకోవద్దు. ఈ విషయంలో ఎవరైనా సరే సంయమనం పాటించాలి.|EDITORIALS

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News