ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల క్రితం ఫ్రాన్స్‌కు వెళ్లిన సందర్భంగా, ఆయన ప్రయాణించే విమానంపై ఉగ్రదాడి జరిగే అవకాశముందనే బెదిరింపు కాల్ ముంబై పోలీసులకు ఫిబ్రవరి 11న అందింది. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఈ కాల్‌ను అధికారులు సీరియస్‌గా పరిగణించి, కేసును తీవ్రంగా దర్యాప్తు చేపట్టారు. సమాచారాన్ని ఇతర దర్యాప్తు ఏజెన్సీలకు చేరవేశారు. వివరణాత్మకంగా చేసిన దర్యాప్తులో, కాల్ చేసిన వ్యక్తిని చెంబూరు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతను మానసిక స్థిరత్వం లేని వ్యక్తిగా గుర్తించామని ముంబై పోలీసులు తెలిపారు.

