సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాట నేపాల్ వీధుల్లో సందడి చేస్తోంది. కొందరు యువతులు రోడ్డుపై కుర్చీలు పెట్టి ఈ పాటకు అచ్చం ఒరిజినల్ స్టెప్స్‌తో డాన్స్ చేస్తూ హల్‌చల్ చేశారు. స్థానికులు వీరి నృత్యాన్ని ఆస్వాదిస్తూ అభినందనలు పలికారు. ఈ డాన్స్ వీడియోను మహేశ్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు, దీని ద్వారా పాటకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరుగుతోంది.

