టర్కీలో వాయువ్య ప్రాంతంలోని ఒక ప్రముఖ స్కీ రిసార్ట్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. 12 అంతస్తుల హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు, 51 మంది గాయపడ్డారు.
ప్రమాద సమయంలో భయాందోళనతో భవనంపై నుంచి దూకిన ఇద్దరు వ్యక్తులు మరణించారని సమాచారం. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని టర్కీ ఆరోగ్య మంత్రి కెమల్ మెమిసోగ్లు వెల్లడించారు. 17 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
అగ్నిప్రమాదం స్థలాన్ని టర్కీ మంత్రి యెర్లికాయ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం కారణంగా హోటల్‌లో భారీ నష్టం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి.

