ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ డిజైరబుల్ కపుల్స్‌లో ఒకటైన టామ్ హాలండ్, జెండయా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో జెండయా భారీ డైమండ్ రింగ్‌తో కనిపించడం, లాస్ ఏంజిల్స్ టైమ్స్ రిపోర్టర్ ప్రశ్నకు ఆమె నేరుగా సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ స్పందించడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించాయి. 2021 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట అప్పుడప్పుడూ పబ్లిక్‌లో కనిపించినప్పటికీ తమ ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. వీరిద్దరూ స్పైడర్ మాన్: నో వే హోమ్ తర్వాత మరొక మార్వెల్ చిత్రంతో పాటు 2026లో క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ సినిమాలో కలిసి నటించనున్నారు. ఈ హిస్టారికల్ డ్రామాలో పలువురు ప్రముఖ నటులు కూడా ఉన్నారు.

