నేపాల్-టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. లుబుచేకు 93 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం గుర్తించబడింది. భారత్‌లోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఢిల్లీ – NCR ప్రాంతంలో తీవ్ర ప్రకంపనలు వచ్చాయి. బిహార్‌లోని పాట్నా సహా పలు జిల్లాల్లో భూకంపంతో భయాందోళన నెలకొంది. భారత్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ దేశాల్లో భూప్రకంపనలు సంభవించాయి. చైనాలో భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూప్రకంపనల కారణంగా ప్రజలు భయభ్రాంతులయ్యారు, వారంతా రోడ్లపైకి పరిగెత్తారు.

