భారత క్రికెట్ జట్టు తరఫున ఆస్ట్రేలియా గడ్డపై నితీశ్ కుమార్ రెడ్డి తన తొలి టెస్టు శతకాన్ని సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనకు ఆయన తండ్రి ముత్యాలరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కఠినమైన పరిస్థితుల్లో 99 పరుగుల ఒత్తిడిని తట్టుకుని నితీశ్ మూడంకెల స్కోరును పూర్తి చేయడం ప్రత్యేక ఘట్టమైంది. బ్యాటింగ్ చేస్తూ జట్టును ముందుండి నడిపించిన నితీశ్ శతకంతో భారత్ కీలక స్థితికి చేరుకుంది.
తన కుమారుడి విజయంపై ముత్యాలరెడ్డి మాట్లాడుతు, “ఇది మా కుటుంబానికి తీరని ఆనందం. నితీశ్ చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై ఆసక్తి చూపుతూ శ్రమించాడని, ఈ రోజు అది ఫలితంగా కనిపిస్తోందని” తెలిపారు. 99 పరుగుల వద్ద టెన్షన్‌లో ఉన్నా, తన కుమారుడు శతకం సాధించడం గర్వకారణంగా అనిపించిందన్నారు.
నితీశ్ శతకం అనంతరం టీమ్ ఇండియా ఆటగాళ్ల నుంచి స్టాండింగ్ ఓవియేషన్ లభించగా, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లు అతని ప్రతిభను ప్రశంసించారు. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా ఆసీస్ సిరీస్ కోసం నితీశ్ ఎంపిక చేసిన నిర్ణయాన్ని అభినందించారు. 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించిన నితీశ్ యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు.

