ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. తన సందేశంలో, “డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం దేశానికి తీరని లోటు. ఆయన ఆర్థిక రంగంలో చేసిన సేవలు, ప్రధానిగా దేశానికి అందించిన నాయకత్వం చిరస్మరణీయాలు. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి,” అని పేర్కొన్నారు.

