TELUGU STATES|తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ఆటా కార్యక్రమాలు ప్రారంభం
జిల్లెలగూడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా|SABITHA INDRAREDDY
EDUCATION|విద్య, HEALTH|ఆరోగ్యం, CULTURE|సంస్కృతికి ఆటా ప్రాధాన్యం
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో డిసెంబర్ 12 నుంచి 27 వరకు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సేవా, సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి పోస్టర్‌ను ఆవిష్కరించి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్, రంగా రెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖ వరకు ఈ సేవ కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు.

అనంతరం రంగారెడ్డి జిల్లా, జిల్లెలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా దంపతుల ఆర్థిక సహకారంతో స్కాలర్‌షిప్‌లు అందించగా, ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, టియుఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నరసింహ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్న ఆటా సేవలు అనిర్వచనీయమని వారు అభినందించారు.
ఇదే సందర్భంలో ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి మాట్లాడుతూ, డిసెంబర్ 13 నుండి 27 వరకు ఐఐటీ కందిలో సెమినార్‌లు, సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ సాహిత్య సదస్సు, ఆంధ్రప్రదేశ్ లో బిజినెస్ సెషన్లు, యువజన ఈవెంట్లు, వాలీబాల్ టోర్నమెంట్, ఆరోగ్య శిబిరాలు, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు, నిషాంత్ బాలసదన్ చారిటీ, ఆలయ ప్రతిష్టాపనలు జరుగనున్నాయి. డిసెంబర్ 27న రవీంద్రభారతిలో గ్రాండ్ ఫినాలేతో వేడుకలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆటా బృందంలోని నరసింహ ద్యాసాని, సాయి సూదిని, కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బాణాల, బోర్డు ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త, మాజీ అధ్యక్షులు పరమేష్ భీమ్ రెడ్డి, బిజినెస్ చైర్ హరీష్ బత్తిని, నర్సి రెడ్డి, తిరుమల్ రెడ్డి, రాజ్ కక్కర్ల, రామకృష్ణారెడ్డి అల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

