పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా లేకుండా ఒకాయనే మంచి ఇకమతు చేసిండు.

పాత ఇనుప సువ్వలు తీసుకుండు. గ వాటిని ఒకదానికి ఒకటి ఒడుపుగ అతికిపిచ్చిండు. గదాని చివరికి గింత కొండి లెక్క చేసిండు. ఇగ గదాన్ని మంచిగా పట్టుకొని గా కొండి తోటి కలుపు మొక్కలు పీకే ఉపాయం చేసిండు. కట్టం లేకుండా, కలుపు తీసే, గీ ఇకమతు మంచి గుంది కదా!?

