ఏడుపాయల అమ్మవారి ఆలయానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు మెదక్ జిల్లా అభివృద్ధి పనులకోసం వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో మెదక్ అసెంబ్లీకి మంజూరైన మెడికల్ కాలేజీ కోసం 20 ఎకరాల భూమి, రూ.250 కోట్ల నిధులు, దుబ్బాకలో హబ్సిపూర్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు 4వేలైన్ రోడ్ కోసం రూ.20 కోట్లు, అలాగే శిలాజినగర్ నుండి ఏనుగుర్తి వరకు రహదారి కోసం రూ.40 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.

