Friday, April 3, 2026
35.2 C
Hyderabad

PARTY|పార్టీ – GOVERNMENT|ప్రభుత్వం కలిసి పనిచేయాలి

PAC|పీఏసీ సమావేశంలో CM|సీఎం REVANTH REDDY|రేవంత్ రెడ్డి

TELANGANA PRADESH CONGRESS| తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ POLITICAL AFFAIRS COMMITTEE| రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసి) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలు సమన్వయంతో పని చేయాలని, సమాజంలోని అన్ని స్థాయిల ప్రజలకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చేరాలంటే బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. పార్టీ, ప్రభుత్వం కలిసి ఒకే జోడెద్దులా ముందుకు సాగాలని, రెండూ విడివిడిగా పనిచేసే అవసరం లేదన్నారు.

గత 18 నెలల పాలనను GOLDEN PERIOD| ‘గోల్డెన్ పీరియడ్’గా అభివర్ణించిన రేవంత్, ఈ కాలంలో అనేక సంక్షేమ పథకాలు, సామాజిక అంశాల పరిష్కారాలు సాధించామని గుర్తు చేశారు. అయితే భవిష్యత్తులో డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు వంటి కీలక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని తెలిపారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీ కేడర్ బలపడాలంటే BOOTH| బూత్, గ్రామ, మండల స్థాయిలలో కమిటీలు వేయాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉన్నప్పుడే ప్రభుత్వ పథకాలు ప్రజల దాకా సమర్థవంతంగా చేరుతాయని వివరించారు. అలాగే, పార్టీ క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకు సాగాలని, అధికారం మళ్లీ కాంగ్రెస్ వశమయ్యేలా ప్రతీ నాయకుడు తన స్థాయిలో పని చేయాలని సూచించారు.

కేవలం POSTS| పదవుల కోసం కాకుండా, పని చేయాలన్న దృఢ సంకల్పంతో కార్యకర్తలు ముందుకు రావాలని, పార్టీ కష్ట కాలంలో పనిచేసిన వారికే ఇప్పుడు పదవులు ఇచ్చామని స్పష్టం చేశారు. పార్టీ కమిటీలలో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్ లో ప్రత్యక్షంగా పని చేయాలని, ప్రజల్లోకి వెళ్లాలని హితవు పలికారు. మార్కెట్ కమిటీలు, దేవస్థానాల కమిటీల వంటి నామినేట్ పోస్టులను కూడా పార్టీ నేతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

JUBILEE HILLS| జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వచ్చే ఉప ఎన్నికపై కూడా పార్టీ సిద్ధంగా వుందన్నారు. తాను స్వయంగా రాష్ట్రంలో గ్రామాల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా నిలబెట్టేందుకు పీసీసీ తన దృష్టిని పూర్తిగా పార్టీ నిర్మాణం పైనే కేంద్రీకరిస్తుందని చెప్పారు. పార్టీ నాయకులందరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగి కాంగ్రెస్ ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

పార్టీ నిర్మాణంలో కార్యవర్గ సభ్యుల పాత్ర కీలకం

పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం

తెలంగాణ రాష్ట్ర పీసీసీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పార్టీ అభివృద్ధి, పాలనా విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన పీసీసీ కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలుపుతూ, కార్యకర్త స్థాయి నుంచే చాలామంది నాయకులు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఎదిగారని గుర్తుచేశారు. పార్టీ బాధ్యతలు నిబద్ధతగా నిర్వహిస్తే పదవులు సహజంగానే వస్తాయని చెప్పారు. తాను కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలతోనే ముఖ్యమంత్రి పదవికి చేరుకున్నానని అన్నారు.

పార్టీకి నిస్వార్థంగా సేవ చేసిన 65 మందికి ప్రభుత్వంలో పదవులు ఇచ్చామన్నారు. పార్టీ పదవులు అనగా పనికి రానివారికి చోటు లేదని, అలాంటి వారిని పీసీసీ అధ్యక్షుడు పక్కన పెడతారని తేల్చిచెప్పారు. త్వరలో పార్టీ కార్యకర్తల ఎన్నికలు, తదుపరి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని, కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన బాధ్యతను ప్రతి కార్యకర్త తలచుకోవాలని అన్నారు.

తన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కేవలం 18 నెలల్లోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1,04,000 కోట్లు ఖర్చు చేశామని, ఇది దేశంలో ఎటువంటి ప్రభుత్వమూ చేయని విధంగా సాగిందని చెప్పారు. విద్యార్థుల హాస్టళ్లలో కాస్మెటిక్ చార్జీలు 200 శాతం, డైట్ చార్జీలు 40 శాతం పెంచామని వివరించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 35 ఏళ్లుగా జరుగుతున్న పోరాటానికి పరిష్కారం చూపించామని వెల్లడించారు. ఎన్నో త్యాగాల పర్యవసానంగా ఈ న్యాయం సాధ్యమైందని తెలిపారు.

తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించామని చెప్పారు. పార్టీ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ చురుకైన పాత్ర పోషించాలన్నారు. పార్టీ పదవులను చిన్నగా చూడకూడదని, ఇవే భవిష్యత్‌లో పెద్ద అవకాశాలకు బాటలు వేస్తాయని అన్నారు. 2029లో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని పదవులు పార్టీ కార్యకర్తలకే అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

18 నెలల పాలనను “గోల్డెన్ పీరియడ్”గా అభివర్ణిస్తూ, ప్రజల్లోకి ఈ విజయాలను తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా నాయకులు ఉండాలన్నారు. గత బీఆర్‌ఎస్‌ 10 ఏళ్ల పాలనకు, కాంగ్రెస్ 18 నెలల పాలనకు మధ్య బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మన ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని పునరుద్ఘాటించారు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News