Friday, April 3, 2026
33.2 C
Hyderabad

TODAY|నేడే విస్తరణ!|EXPANSION

SIX|ఆరు ఖాళీల్లో ప్రస్తుతం THREE|ముగ్గురికే అవకాశం
BC|బీసీ, SC|ఎస్సీ వర్గాలకే పరిమితం
VIVEK|వివేక్‌, ADLURI LAXMAN KUMAR|అడ్లూరి, VAKITI SRIHARI|వాకిటి శ్రీహరిలకు చోటు
RAJ BHAVAN|రాజ్ భవన్ లో ఏర్పాట్లకు ఆదేశం
AFTERNOON|మధ్యాహ్నం 12.15కు ముహూర్తం
CM|సీఎంను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు
అందుబాటులో ఉండండని సీఎం ఆదేశాలు
మిగతా మూడు బెర్తులకూ ఖరారు…
కానీ, CONGRESS|కాంగ్రెస్ లో తకరారు
ఆఖరి క్షణం వరకూ చర్చోప చర్చలు… వీడని ఉత్కంఠ

హైదరాబాద్‌, జూన్‌ 7 (అడుగు న్యూస్):
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ హై కమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆదివారం తెలంగాణ కేబినెట్‌ విస్తరణ జరుగనుంది. మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు- దక్కనుంది. ఆరు ఖాళీల్లో ప్రస్తుతం ముగ్గురికే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. బీసీ, ఎస్సీ వర్గాలకే విస్తరణను పరిమితం చేశారు. ఎస్సీ మాల సామాజికవర్గం నుంచి వివేక్‌, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీ సామాజిక వర్గం నుంచి ముదిరాజ్ కు చెందిన వాకిటి శ్రీహరిలకు చోటు దక్కనుంది.
ఇప్పటికే రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12.45కు ముహూర్తంగా నిర్ణయించారు. మరోవైపు సీఎంను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు కలిసి తమకే అవకాశం ఇవ్వాలని అడిగారు. వాళ్ళంతా ఎవరికి అవకాశం వచ్చినా కలిసి ఉండాలని, అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. అయితే మిగతా మూడు బెర్తులకూ పేర్లు ఖరారు అయినప్పటికీ, ప్రస్తుతం ఆ మూడు ఖాళీల భర్తీతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడకూడదని, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తాత్కాలికంగా ఆ మూడు బెర్తుల భర్తీని నిలిపివేసినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ తరహా రాజకీయాల్లో భాగంగా ఆఖరి క్షణం వరకూ చర్చోప చర్చలు జరిగాయి. వీడని ఉత్కంఠ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ ఎట్టకేలకు జరుగుతున్నది.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 12 మంది కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. మరో ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఏడాదిన్నరకు పైగా కేబినెట్‌ విస్తరణ జరగలేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగింది. తమకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానం చుట్టూ నేతలు తిరుగుతున్న పరిస్థితి. ఇటీవల విూనాక్షీ నటరాజన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్ గా నియమితులైన తర్వాత ఆశావాహులంతా కూడా ఆమె కలిసి మంత్రి పదవి కోసం వినతులు చేశారు. కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్‌ నేతలు తమకు అవకాశం కల్పించాల్సిందిగా సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు-, ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సంకేతాలు ఇచ్చింది. నేడు మంత్రి వర్గ విస్తరణ జరగుతున్నది. రాజ్‌భవన్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

అనేక ఊహాగానాలు, మంత్రులుగా పదవులకు రేసులో నిల్చిన వాళ్ల పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలించి చివరకు వడపోసింది. రేవంత్‌ రెడ్డి క్యాబినెట్లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు పదవులు కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక ముగ్గురిలో ఇద్దరు దళిత సామాజికవర్గానికి చెందిన వారు కాగా..ఒకరు బీసీ నేతకు క్యాబినెట్‌ ర్యాంక్‌ కల్పిస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌తో పాటు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ రావు తో పాటు బీసీ సామాజికవర్గానికి చెందిన మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రిపదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆదివారం మధ్యాహ్నం ఈ క్యాబినెట్‌ విస్తరణ ప్రక్రియ అధికారికంగా ప్రకటిస్తారు. తెలంగాణలో సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రివర్గంలో మరో ముగ్గురికి కొత్త మంత్రులుగా చోటు దక్కింది. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పటి వరకు ఉన్న మంత్రులతో పాటు మరికొందరికి అవకాశం కల్పించింది పార్టీ హైకమాండ్‌. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల వారిగా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని దళిత, వెనుకబడిన సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను కొత్త మంత్రి పదవులకు ఎంపిక చేసింది. ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ను మాల సామాజికవర్గం నుంచి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(మాదిగ)తో పాటు అడ్లూరి లక్ష్మణ్ రావు పేర్లు పరిశీలించిన అధిష్ఠానం చివరకు లక్ష్మణ్ పేరే ఖరారైనట్లు తెలిసింది. బీసీ నేత ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కూడా కొత్త మంత్రుల జాబితాలో చేర్చింది. కాగా కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజ నేతల్లో ఒకరు అయిన కాకా వెంకటస్వామి కుమారుడు గడ్డం వివేక్‌ . చెన్నూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. %వీదీదీూ% చదివిన వివేక్‌, విశాఖ ఇండస్ట్రీస్‌ ను స్థాపించారు. అలాగే మీడియా సంస్థనూ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, పలుమార్లు అరెస్టయ్యారు. 2009లో పెద్దపల్లి నుండి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్‌, %దీRూ, దీజీూ%లలో పనిచేసి, 2023లో కాంగ్రెస్‌లోకి తిరిగి చేరారు. విద్య, సామాజిక సేవ, సమాజ సాధికారత కోసం విశాఖ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.100 కోట్లకు పైగా వెచ్చించారు. మాల వర్గానికి చెందిన ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఆశీస్సులు ఉండటంతో పదవి లభించింది. వివేక్‌ సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కుమారుడు ఎంపీగా ఉన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1965లో కరీంనగర్‌ జిల్లాలో జన్మించిన ఆయన, కాకతీయ మెడికల్‌ కాలేజీ నుండి %వీదీదీూ, వీూ% పూర్తి చేశారు. వైద్యుడిగా సుదీర్ఘ కెరీర్‌లో, ఆయన అనేక గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహించి, సామాజిక సేవలో తనదైన ముద్ర వేశారు. 2023 ఎన్నికల్లో రసమయి బాలకిషన్‌ను 32,365 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఎమ్మెల్యేగా, ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, రెవెన్యూ సదస్సులు, క్రీడా టోర్నమెంట్‌లు వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మాదిగ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆ వర్గ ఎమ్మెల్యేలంతా పోరాడారు. ఆ వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి అవకాశాన్ని హైకమాండ్‌ ఇస్తోంది. లక్ష్మణ్ కుమార్ అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ పై గెలిచారు. ముదిరాజ్‌ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించడంతో వాకిటి శ్రీహరికి అవకాశం లభిస్తోంది. ఆయన నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గం నుండి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌ రెడ్డిని 17,525 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఆయన తండ్రి వాకిటి నరసింహులు రైతు. 2001-2006 మధ్య మక్తల్‌ గ్రామ సర్పంచ్‌గా, 2014-2018 మధ్య జెడ్పిటిసి సభ్యుడిగా పనిచేశారు. 2024లో సమగ్ర కుటుంబ సర్వే, బీసీ కుల గణన వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించారు. తెలంగాణ మంత్రివర్గంలో మరో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయి. రెడ్డి సామాజికవర్గం నుంచి చాలా మంది సీనియర్‌ నేతలు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే సమస్యలు వస్తాయని పూర్తిగా ఖాళీగా ఉంచుతున్నారు. ఆ ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారో .. కానీ వాటికి రేస్‌ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News