Friday, April 3, 2026
35.2 C
Hyderabad

PALAKURTHI|పాలకుర్తిలో హై టెన్షన్|HIGH TENSION

TELANGANA|తెలంగాణ THALLI|తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో CONGRESS|కాంగ్రెస్, BRS|బీఆర్ఎస్ వర్గాల ఘర్షణ

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి గొడవ తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది తోపులాట, కొట్టుకోవడం వరకు దారి తీసింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వం రోడ్డు వెడల్పులో భాగంగా అంతకు ముందు వున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసివేసి పోలీసు స్టేషన్ లో భద్రపరిచారు. రోడ్డు పనులు పూర్తి అయిన తర్వాత ఏర్పాటైన ఒక కూడలిలో విగ్రహం కోసం రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన గద్దెపై BRS పార్టీ ప్రభుత్వ కాలం నాటి పాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ అభ్యంతరం తెలుపుతుండగా, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చాక ఆమోదించిన అధికారిక తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని కాంగ్రెస్ నాయకులు ఇలా రెండు పార్టీలు గొడవ పడుతుండగా కాంగ్రెస్ పార్టీలో వున్న తెలంగాణ ఉద్యమకారులు అక్కడే సెంట్రింగ్ వేసి నిర్మాణం చేపట్టారు. దీనిపై ఆగ్రహించిన బీఆర్ఎస్ నాయకులు మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్ రావు, మండల అధ్యక్షులు పసునూరి నవీన్ ల నేతృత్వంలో కార్యకర్తలు నిన్న ఉదయం నుండి 2 సార్లు ధర్నా చేయగా 3వ సారి స్వయంగా వారే గద్దెపై వేసిన స్లాబును కూల్చివేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ సమయంలో బిఆర్ఎస్ నాయకులు అధికారిక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దు అని కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ ఎంపీపీ గడ్డం యాకసోమయ్య, మొళుగూరి యాకయ్య, గడ్డం బాబు, నారగోని ఎల్లయ్య లపై దాడి చేయగా వారికి గాయాలు అయ్యాయి. పోలీసుల రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడగా నివారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మళ్లీ అడ్డుగా వచ్చి గద్దె స్లాబ్ ను కూల్చి వేయటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

JHANSI REDDY|ఝాన్సీ రెడ్డి పరామర్శ

ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాలకుర్తి ప్రైవేట్ దవాఖానలో దాడిలో గాయపడ్డ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, గద్దె నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాలకుర్తి పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఏసిపి నర్సయ్య ను కలిసి మా కార్యకర్తలను కొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసులు మరిన్ని ఘటనలు జరగకుండా అర్ధరాత్రి వరకు రాజీవ్ చౌరస్తాలో పోలీసు బలగాలు మోహరించాయి.

విగ్రహ ఏర్పాటు

ఈ ఘటనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పక్కా ప్లాన్ తో తెల్లవారుజామున 12 గంటల వరకు నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు అక్కడే కూర్చొని దగ్గరుండి గద్దె నిర్మాణం చేయించి అధికారిక తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించారు.

రాష్ట్రంలో రెండవ విగ్రహం మనదే – MLA|ఎమ్మెల్యే యశస్విని|YASHASWINI

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక సెక్రటేరియట్ లో మొదటి విగ్రహం ఏర్పాటు చేయగా, రెండవ విగ్రహం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. బి.ఆర్.ఎస్ నాయకులు కావాలనే విగ్రహ ఏర్పాటు విషయంలో చిల్లర చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పినా… కూడా వారు మారలేదన్నారు.

ప్రభుత్వ అనుమతి ఉంది – నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి

పాలకుర్తిలో ఏర్పాటు చేస్తున్న అధికారిక తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రభుత్వ అనుమతి తీసుకున్నట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఎర్రబెల్లి చిల్లర రాజకీయాల రూపమే ఈ విగ్రహ ప్రతిష్ఠ గొడవ అని అన్నారు. అలాగే ఇదే సందర్భంలో మా కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా వదిలేది లేదని, వారి సంగతి తెలుస్తానని చెప్పారు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News