119 ఎమ్మెల్యే|119 MLA CANDIDATES|అభ్యర్థులతో విడి విడిగా భేటీ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని నియోజకవర్గాల వారీగా విశ్లేషించేందుకు పార్టీ ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే ఉండనున్నారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులను విడివిడిగా కలిసి సమీక్ష జరపనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ADILABAD|అదిలాబాద్, PEDDAPALLI|పెద్దపల్లి, KARIMNAGAR|కరీంనగర్, NIZAMABAD|నిజామాబాద్, ZAHEERABAD|జహీరాబాద్, MEDAK|మెదక్, MALKAJGIRI|మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ఉన్న అభ్యర్థులతో ఆమె సమీక్ష నిర్వహించనున్నారు. ప్రతి అభ్యర్థితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడి వారి అనుభవాలు, ఓటర్ల స్పందన, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. రేపు మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులతో సమావేశమవుతారు. భవిష్యత్ లో పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసేలా మీనాక్షీ నటరాజన్ ఈ సమీక్షల ద్వారా వ్యూహాలు రూపొందించనున్నట్లు సమాచారం.

