సీఎం ఛార్జ్‌షీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
TELANGANA|తెలంగాణ CM|ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు NATIONAL HERALD|నేషనల్ హెరాల్డ్ చార్జ్‌షీట్‌లో ఉండటం రాష్ట్ర ప్రజలకు అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నైతికత, నిజాయితీ ఉంటే రేవంత్ స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ ఆయన్ని పదవి నుంచి తప్పించాల్సిందిగా కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో బాగ్‌మేన్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ రూట్ స్కామ్‌లో కీలకపాత్ర పోషించారని, ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంగా వాడుతున్న దానికి నిదర్శనమని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు ఈడీ చార్జ్‌షీట్‌తో నిజమని రుజువైందని తెలిపారు. ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో, ఏ పదవుల కోసం ఇచ్చారో, ఎన్ని మొత్తాల్లో పంపారో ఈడీ స్పష్టంగా వెల్లడించిందన్నారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|
తెలంగాణ సీఎం పదవిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్‌కు ముడుపులు పంపుతున్నారని, 17 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పారని ఎద్దేవా చేశారు. అమిత్ షా కాళ్లు పట్టుకుంటూ కేసుల నుంచి తప్పించుకోవాలని వేడుకుంటారని, బయటకి వచ్చాక పెద్ద ఫోజులు కొడతారని విమర్శించారు. లక్షా ఎనభై వేల కోట్ల అప్పు చేసి ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని, ఒక్క హామీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. తెలంగాణ సంపదను దోచుకుని ఢిల్లీకి పంపే రాజకీయ కమిషనర్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|
రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశం చుట్టేస్తున్నా, తన పార్టీ సీఎం అవినీతిపై మాట్లాడడం లేదన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు స్పందించగా, రేవంత్ మాత్రం జపాన్ పర్యటన పేరుతో తప్పించుకోవడం అనుమానాస్పదమన్నారు. మౌనం వీడని కారణం తనపేరూ చార్జ్‌షీట్‌లో వచ్చే అవకాశం ఉందన్న భయమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|
తెలంగాణ బీజేపీ నేతలు కూడా రేవంత్ అవినీతిపై మౌనంగా ఉండటం, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న కుమ్మక్కునకు నిదర్శనమన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్‌పై బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తుంటే, అదే కేసులో ఉన్న రేవంత్‌పై మాత్రం తెలంగాణ బీజేపీ నేతలు మౌనం వహించడం పాక్షికతకు ఉదాహరణగా పేర్కొన్నారు. పోంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు జరిగి ఏడాది అయినా ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా బయటకు రాలేదని, 45 కోట్లు వాల్మీకి స్కామ్ ద్వారా తెలంగాణకు వచ్చాయని రిమాండ్ డైరీలోనే ఈడీ పేర్కొన్నదని గుర్తు చేశారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|
సివిల్ సప్లై స్కామ్‌పై తమ వద్ద ఆధారాలతో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. అమృత్ కుంభకోణంలో రేవంత్ బావమరిది శోధా కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అర్హత లేకుండా రూ.1137 కోట్ల టెండర్లు అప్పగించారని పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో కేంద్ర ఎంపవర్ కమిటీ నివేదిక ఇచ్చినా కేంద్రం చర్యలు తీసుకోలేదని, ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య అవినీతి ఒప్పందాలకు ఉదాహరణ అన్నారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఎలాంటి అవినీతి జరగలేదని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం మంత్రులే బహిరంగంగా 30 శాతం కమిషన్ అడుగుతున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయని, ఇది రేవంత్ ప్రభుత్వానికి గుణపాఠమని అన్నారు. సీఎంకు పిల్లనిచ్చిన ఆయన మామే కాళేశ్వరంపై అవినీతి ఆరోపణలు అవాస్తవమని పేర్కొంటున్నారని చెప్పారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|
మీడియా కొన్ని పత్రికలు నేషనల్ హెరాల్డ్ చార్జ్‌షీట్‌లో రేవంత్ పేరుని సైతం ప్రచురించలేదని, ఎంత తాపత్రయపడ్డా ప్రజలెప్పుడో నిజాలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీగా బీఆర్‌ఎస్‌లో ఎవరైనా అధ్యక్షుడికి సూచనలు చేయవచ్చని, గతంలోనూ అనేక మంది నేతలు లేఖలు రాశారని చెప్పారు. కోవర్టులు ఎవరో బయటపడతారని వ్యాఖ్యానించారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|
కేటీఆర్ చివరగా హెచ్చరిస్తూ, ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలంటూ గవర్నర్‌ను కలవనున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే నెలరోజుల్లో తమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కేంద్రాన్ని, బీజేపీని ప్రజలముందు ఎండగడతామన్నారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

