Friday, April 3, 2026
35.2 C
Hyderabad

Youth|యువతకు ప్రేరణనిచ్చిన మహానాయకుడు రాజీవ్ గాంధీ|Rajiv Gandhi

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి|CM|REVANTH REDDY ఘన నివాళి

భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సెక్రటేరియట్ ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశానికి వన్నె తెచ్చిన మహానాయకుడని, ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణ విధానాలు భారతదేశాన్ని బలమైన ఆర్థిక దేశంగా తీర్చిదిద్దాయని కొనియాడారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యంలో యువతకు స్థానం కల్పించిన గొప్ప నాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీని ప్రశంసించారు.|Rajiv Gandhi|CM|REVANTH REDDY

ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, దేశంలో ఉగ్రవాదుల దాడులకు గట్టి బుద్ధి చెప్పిన ప్రధాని ఇందిరాగాంధీని ప్రస్తావించారు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో తల్లి ఇందిరమ్మ చూపిన దారిలో నడిచిన వ్యక్తే రాజీవ్ గాంధీ అని చెప్పారు. అప్పట్లో తమ దేశాన్ని మేమే రక్షించగలమని స్పష్టం చేసిన ఇందిరమ్మ ధైర్యాన్ని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పడంలో ప్రధాని మోడీ వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చెప్పగానే కాల్పుల విరమణ చేసిన కేంద్రం, దేశ సమగ్రతపై రాజకీయం చేస్తోందని ఆరోపించారు.|Rajiv Gandhi|CM|REVANTH REDDY

రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు, వారి చేతగానితనాన్ని దాచడానికి చేసే ప్రయత్నమేనని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రానికి అండగా నిలవాల్సిన కిషన్ రెడ్డి, అత్యవసర పరిస్థితుల్లో స్పందించలేకపోయారని ఎద్దేవా చేశారు. బయటకు వచ్చి మేము కేంద్రానికి మద్దతుగా ఉన్నామన్న వారు, రాహుల్ గాంధీని విమర్శించడానికి మాత్రం తడబడ్డారన్నారు.|Rajiv Gandhi|CM|REVANTH REDDY

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ఎదుట ఏర్పాటు చేయడంపై వచ్చిన విమర్శలను సీఎం తీవ్రంగా ఖండించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదన్నారు. దేశ భద్రతపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయదని, భద్రతా దళాలకు తాము పూర్తి మద్దతుగా ఉంటామని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశయ సాధన దిశగా తాము నిరంతరం పని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.|Rajiv Gandhi|CM|REVANTH REDDY

రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన వారిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్ తదితర ప్రముఖులు ఉన్నారు.|Rajiv Gandhi|CM|REVANTH REDDY

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News