‘అడుగు’ ఎక్స్ క్లూజివ్!
ఒకటి రెండు రోజుల్లోనే పీసీసీ ప్రకటన!
-24న బ్లాక్, మండల అధ్యక్షులు
ఆ తర్వాత డీసీసీలకు ఇంటర్వ్యూలు
|Congress|CM|Revanth Reddy|TPCC|AICC|CONGRESS PARTY|
ఒకటి, రెండు రోజుల్లోనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ ప్రకటన జరగనుంది. దీనికి సంబంధించిన కసరత్తును ఎఐసిసి పూర్తి చేసింది. ఏకాభిప్రాయం కుదిరింది. ఇక ప్రకటనే తరువాయిగా మిగిలింది. ఈసారి టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ మార్కు స్పష్టంగా ఉండనుంది. టీపీసీసీని సమూలంగా మార్చి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసినట్లుగా అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం. గతంలో ఎన్నడూలేని విధంగా జూన్ 1 నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి, పూర్తిగా ప్రజల్లో ఫుల్ టైమ్ పని చేసే విధంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తున్నది. ఈ నెల 24కల్లా మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గాలను పూర్తి చేసి, ఆతర్వాత డిసిసి ల ఇంటర్వ్యూలకు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువులోగా పార్టీ సంస్థాగత పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.|Congress|CM|Revanth Reddy|TPCC|AICC|CONGRESS PARTY|

