అమ్మా… ఎట్లూన్నావ్….నీకెంత మంది కొడుకులు, బిడ్డలు… నీకు పెన్షన్ వస్తుందా…. సన్న బియ్యం మంచిగున్నది కదా….అంటూ… మాదాపురం తండాలోని ఒక గిరిజన ఇంట్లో అక్కడ ఉన్న అవ్వతో… అంటూ…. స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వారితో కలిసి భోజనం చేశారు. విషయంలోకి వెళ్తే… జనగామ జిల్లా పాలకుర్తి మండలం మాదాపురం తండాలో ఓ గిరిజనుడి ఇంటికి వెళ్లి, ప్రభుత్వ రేషన్ షాప్ ద్వారా అందిన సన్నబియ్యంతో వంట చేసిన భోజనాన్ని స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తండా వాసులతో కలిసి భోజనం చేస్తూ…. వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీరు ఆశీర్వదించిన మీ బిడ్డను, మీ కోసం మన రేవంతన్న ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తున్నాడు అంటూ…. ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరించారు. ఈ సందర్భంగా తండా వాసులు రేవంతన్న వచ్చిన తర్వాతే గిరిజన తండాలు, దళిత గూడాల్లోని పేద కుటుంబాలలో ఆనందం వెల్లివిరుస్తుంది అని ఎమ్మెల్యే తో చెప్పగా, మీ కోసం 24 గంటలు పని చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ….మీ ఆశీర్వాదంతో మరింత బలం తనకు కలిగిందని, తప్పకుండా మీకోసం పనిచేస్తున్నాను. చేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు.


