పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలం, గొల్లపల్లి గ్రామంలో రూ. 5 లక్షల వ్యయంతో ఎస్డిఎఫ్ నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రోడ్లు, నీరు, విద్యుత్, ఆరోగ్యం వంటి రంగాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.

ఆ తరువాత దేవరుప్పుల మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకాలు పేద కుటుంబాలకు అండగా ఉంటాయని, అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని అన్నారు.ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

