Friday, April 3, 2026
32.2 C
Hyderabad

అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

2025 సంవ‌త్స‌రానికి ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌ జాబితా
వంద మంది అత్యంత శ‌క్తిమంతుల్లో 28వ‌ స్థానం
గత ఏడాదితో పోల్చితే 11స్థానాలు మెరుగైన సీఎం స్థానం

ఢిల్లీ: త‌న ప‌రిపాల‌నా నైపుణ్యం.. ప్ర‌భావంత‌మైన రాజ‌కీయంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శ‌క్తిమంత‌మైన నాయ‌కునిగా నిలిచారు. ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌ 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్య‌ధిక శ‌క్తిమంతులైన 100 మంది ప్ర‌ముఖుల‌తో జాబితా విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం ద‌క్కించుకున్నారు. 2024 సంవ‌త్సర‌పు జాబితాలో 39 స్థానంలో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు ఎగ‌బాకి 28వ స్థానానికి చేరుకోవ‌డం విశేషం. దేశంలో రాజ‌కీయ‌, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్య‌క‌లాపాలు, దేశ‌వ్యాప్తంగా ఇండియా కూట‌మిలో పోషిస్తున్న ప్ర‌ముఖ‌మైన పాత్ర‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు ల‌భించింది. త‌నదైన దూకుడుతో భార‌త‌ రాజకీయాల్లో ఆయ‌న చూపుతున్న ప్ర‌భావం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఆయ‌న ర్యాంకు మెరుగుప‌డింది. ఒక ప్రాంతీయ నాయ‌కుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒక‌రిగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భ‌వించారు. ఈ జాబితాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండియా కూట‌మిలోని ఇతర ప్ర‌ముఖులైన సీఎంల సరసన నిలిపింది. ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యతలతో సమన్వయం చేయగలిగిన మేధో సంపత్తి, వ్యూహాత్మక దృక్పథం రేవంత్ రెడ్డిని కీల‌క నాయ‌కునిగా నిలిపేలా చేశాయి. శ‌క్తిమంతులై వంద మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అశ్విన్ వైష్ణ‌వ్‌, బీజేపీయేత‌ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎం.కె. స్టాలిన్, మమతా బెనర్జీ, సిద్ధరామయ్య వంటి నేత‌లు తొలి 25 మందిలో ఉన్నారు.

విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌తో…

రైతు కుటుంబాల‌కు రూ. 21 వేల కోట్ల రుణ మాఫీ చేయ‌డం, క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోన‌స్ ఇవ్వ‌డం, మహిళా స్వయం సహాయక సంఘాల‌కు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌లు, ప్రీమియం రిటైల్ స్టోర్ల వంటి వ్యాపార అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డం, యువ‌త‌ను నిపుణులుగా తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు, ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్‌జెండర్‌ల నియామకం వంటి అనేక విధానపరమైన వినూత్న నిర్ణ‌యాలు దేశ‌వ్యాప్తంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌జాద‌ర‌ణ పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై చెన్నై
స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ్య‌క్తం చేసిన దృఢ‌మైన అభిప్రాయాలు కూడా ఆయ‌న‌కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ద‌క్కేలా చేశాయి.

పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న‌, రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధికి క‌ట్టుబ‌డినందునే *ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ అత్యంత శ‌క్తిమంతుల జాబితా-2025లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి గుర్తింపు ల‌భించింద‌ని పీసీసీ అధ్య‌క్షుడు మహేశ్ గౌడ్ అనాన‌రు. ఈ గుర్తింపు ప్ర‌జ‌ల ప‌ట్ల ముఖ్య‌మంత్రి గారి బాధ్య‌త‌ను మ‌రింత పెంచింద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

భార‌తీయ శ‌క్తిమంతులైన జాబితాలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి చోటు ల‌భించ‌డం భార‌త రాజ‌కీయాల్లో కీల‌క మార్పున‌కు సంకేత‌మ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రాంతీయ నేతలు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో మరింత ప్రభావం చూపుతున్నార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌మ‌ని వారు పేర్కొన్నారు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News