పిల్లలకు మధ్యాహ్న భోజనం మంచిగా వొండాలే… వండే గిన్నెలు నల్లగా అయినాయి…సామాను సరిపోలే…. అనే ముచ్చట్లు ఇగ వంట మనుషులు చెప్పొద్దు…మన ఇందిరమ్మ సర్కారు…. పిల్లలకు బలమైన ఆహారం ఇవ్వాలని… ప్రత్యేక మెను పెట్టింది… వంట చేసేవాళ్ళకి ఇబ్బంది కావొద్దని పైసలు కూడా పెంచింది… పిల్లలకు మంచిగా పెట్టాలే….మీరేమో మంచిగా చదువుకోవాలే… ఇగ మనం అసలు తగ్గేదేలే అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మహబూబాద్ జిల్లా పరిధిలో తొర్రూరు, పెద్దవంగర మండలాలకు సంబంధించి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 75 లక్షల రూపాయల విలువైన వంట సామగ్రిని అందచేశారు. అందులో భాగంగా అమ్మాపురం ప్రభుత్వ పాఠశాల, పెద్దవంగర ప్రభుత్వ పాఠశాలాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈవిధంగా మాట్లాడి…. ఒకవైపు పిల్లల ఆహారం విషయంలో తగ్గొద్దనే చెప్తూ…. మంచిగా చదువుకొని మన ప్రాంతానికి మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


