తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు లు ప్రవేశ పెడుతారు. అందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో మంత్రివర్గం సమావేశమయ్యి, రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను ఆమోదించారు.

