భద్రాద్రి జిల్లాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ రోహిత్ రాజు ఎదుట 64 మంది నక్సల్స్ సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసులకు, సీఆర్పీఎఫ్ అధికారులకు ఇవాళ ఓ మంచి రోజు. మావోయిస్టు పార్టీని, సిద్ధాంతాలను వీడి భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం శుభపరిణామం’ అని ఆయన పేర్కొన్నారు.

