పాల్గొన్న హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గల పాల్కురికి సోమనాథ స్మృతి వనంలో సోమనాథ కళా పీఠం ఆధ్వర్యంలో జరిగిన తొలి తెలుగు ఆదికవి పాల్కురికి సోమనాథుడు దీపారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమనాథుని విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, దీపారాధన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మన పాలకుర్తి నియోజకవర్గం కవులకు, కళాకారులకు, రచయితలకు నిలయం అన్నారు. తొలి తెలుగు ఆది కవి పాల్కురికి సోమనాథుడి జన్మించిన నేలలో మనం పుట్టడం మన అదృష్టం అన్నారు. వారి ఇంటి పేరే క్రమక్రమంగా పాలకుర్తి గా మారిందన్నారు. ఇంత చారిత్రాత్మక నేలను అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న సోమనాథ కళా పీఠం కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత శ్రీ రంగా స్వామి, సోమనాథ కళా పీఠం అధ్యక్షులు డా. రాపోలు సత్యనారాయణ, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీనారాయణ, దేవగిరి రామన్న, లక్ష్మన్న, డా.రమేష్, ఎం.బ్రహ్మచారీ,రాపాక సత్యనారాయణ, చీదర జగదీష్, గూడూరు లెనిన్, బీసీ నాయకులు పులి గణేష్, ఇమ్మడి దామోదర్, ఆలయ పూజారులు డివిఆర్ శర్మ, అనిల్ శర్మ, ఆలయ సూపరింటెండెంట్ వెంకటయ్య, విజేందర్ రెడ్డి, మార్గం సాయి సందీప్ తేజ, కూరపాటి సుదర్శన్, సమ్మయ్య, నిరంజన్, కోటి, యకయ్య, కార్యవర్గం, పూజారులు, కవులు, కళాకారులు, రచయితలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


