నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి తరఫున తమిళనాడు మంత్రి టి.కె.నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధి బృందం ఆహ్వానించారు. ఈ నెల 22న సమావేశం నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టం చర్చించేందుకు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

