(ఫైల్ ఫోటో)
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సి రాజేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మామునూరు విమానాశ్రయం ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే సాధ్యమైందన్నారు. విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే వరంగల్ జిల్లా అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగడంతో పాటు పరిశ్రమల స్థాపనకు ఉపయోగపడుతుందన్నారు.

