ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఊహించని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యే మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ నుంచి తానొక్కడినే గెలిచానని, తనకు మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఒకవేళ సామాజిక సమీకరణాల వల్ల అది సాధ్యపడకపోతే, వేరేవాళ్లను తానే గెలిపిస్తానని అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని అన్నారు.

