ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదు. వారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు. తీన్మార్ మల్లన్నకు ఎన్నో సార్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని హెచ్చరించాం అని చెప్పారు. బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయింది. ఒక వర్గంపై మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పు అన్నారు. అలాగే పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టం వారిపై తగిన చర్యలు తీసుకుంటాం అన్నారు.

