ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుచుకుల్ల రాజేష్ రెడ్డి, జారే ఆదినారాయణ, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

