పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఎన్.సి.సి సేవలు అభినందనీయమని ఎస్ఐ దూలం పవన్ కుమార్, దేవాలయం ఈఓ సల్వది మోహన్ బాబు అన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో(జాతర) భాగంగా గత రెండు రోజులుగా సేవలు అందించిన జనగామ ఏబీవీ డిగ్రీ కాలేజీ, స్టేషన్ ఘనపూర్ విద్య జ్యోతి డిగ్రీ కాలేజీ ఎన్.సి.సి విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మోమెంటో అందచేశారు. ఈ సందర్భంగా వారు చేసిన వాలంటిరింగ్ సేవలు జాతరలో బాగా ఉపయోగపడ్డాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్ శర్మ, సూపరింటెండెంట్ వెంకటయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


