ఉత్తరాఖండ్ లోని సిల్కీయారా సొరంగంలో 2023 లో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. ప్రభుత్వం,ప్రత్యేక దళాలు 17 రోజుల పాటు శ్రమించినా వారిని రక్షించలేకపోయారు. అయితే ఢిల్లీ లోని ర్యాట్ హోల్ మైనర్స్ ఒక్కరోజులోనే వారిని సురక్షితంగా బయటకి తీసుకురావడం విశేషం. SLBL టన్నెల్ లోపల పరిస్థితులను అంచనా వేసి తరువాత వారు ఏం చెప్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.

